Fever: చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు జ్వరం, జలుబు దరిదాపుల్లోకి కూడా రావు?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాతావరణంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం పూర్తిగా మారిపోతోంది. అంతేకాకుండా రోజురోజుకీ చలి తీవ్రత పెరుగు

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 09:30 PM IST

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాతావరణంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం పూర్తిగా మారిపోతోంది. అంతేకాకుండా రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉంది. ఇక మారిన వాతారణం కారణంగా వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ఇంట్లో ఎవరో ఒకరూ జ్వరంతో బాధపడుతున్నారు. అయితే క్లైమేట్ మరింత చల్లగా అవ్వడంత్తో చాలామంది సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జ్వరం, దగ్గు,జలుబు,ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే శీతాకాలంలో ఈ సమస్యలు మరింత వేధిస్తూ ఉంటాయి.

ఎంత మంచి మెడిసిన్స్ వాడినా కూడా ఒక వారం రోజులపాటు ఈ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. మరి శీతాకాలంలో ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కేవలం ఇంగ్లీష్ మెడిసిన్స్ మాత్రమే కాకుండా కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగిస్తే చాలు చలి జ్వరం ఇవన్నీ పరార్ అవ్వాల్సిందే.. జ్వరాన్ని తగ్గించడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలకు తులసి పెట్టింది పేరు. తులసి ఆకులను తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల జ్వరం నుంచి బయటపడవచ్చు. అలాగే తులసి ఆకులతో చేసిన కషాయం తాగడం వల్ల కూడా జ్వరం తగ్గుతుంది. పుదీనా, అల్లంతో చేసిన కషాయాన్ని తీసుకుంటే జ్వరం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

జ్వరంతో బాధపడే వారు ఈ కషాయాన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే ఇట్టే ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా పుదీనా, అల్లం పేస్ట్ తయారు చేసుకొని ఒక చెంచా తీసుకుంటే ప్రయోజనం లభిస్తుంది. జ్వరాన్ని నయం చేయడంలో పసుపు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, ఎండు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. దీంతో జ్వరం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్‌ కు పెట్టింది పేరు. జ్వరాన్ని తగ్గించడంతో వెల్లుల్లి క్రీయాశీలంగా పనిచేస్తుంది. జ్వరంతో బాధపడుతుంటే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను దంచి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే జ్వరం నుంచి ఉపశనమం లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఉన్నపలంగా పెరిగితే చందనం పేస్ట్‌ ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు. చందనంతో చేసిన పేస్ట్‌ను నుదుటిపై అప్లై చేసుకోవడం వల్ల చల్లదనం లభిస్తుంది. శరీరం ఉష్ణోగ్రత వెంటనే తగ్గుతుంది.