Thyroid Diet : థైరాయిడ్ సమస్య వేధిస్తోందా ? ఆరునెలలు ఈ డైట్ పాటిస్తే చాలు..

థైరాయిడ్ వల్ల కొందరు బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. మరికొందరు ఎంత తిన్నా బక్కచిక్కిపోతుంటారు. పెరిగిన బరువు తగ్గేందుకు ఎన్నిరకాల డైట్ లు చేసినా ఫలితం లేక అలసిపోతుంటారు.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 10:17 PM IST

ఈ రోజుల్లో చిన్నా, పెద్ద అందరినీ దాదాపుగా వేధిస్తోన్న సమస్య థైరాయిడ్(Thyroid). ఇందులో చాలా మంది ప్రధానంగా రెండు రకాల థైరాయిడ్ ను ఎదుర్కొంటున్నారు. ఒకటి హైపర్, రెండోది హైపో థైరాయిడ్. థైరాయిడ్ వల్ల కొందరు బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. మరికొందరు ఎంత తిన్నా బక్కచిక్కిపోతుంటారు. పెరిగిన బరువు తగ్గేందుకు ఎన్నిరకాల డైట్ లు చేసినా ఫలితం లేక అలసిపోతుంటారు. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరునెలల్లో థైరాయిడ్ ను తగ్గించుకోవడంతో పాటు.. థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువుని(Weight) కూడా తగ్గించుకోవచ్చు.

సాధారణంగా రోజువారీ జీవితంలో ఉదయం టిఫిన్ టైమ్ లో ఇడ్లీ/దోసె/పూరీ/వడ వంటివి తింటుంటారు. అలాగే మధ్యాహ్నం వేళ వైట్ రైస్ – కర్రీ, నైట్ డిన్నర్ కు కూడా వైట్ రైస్ – కర్రీ లేదా చపాతి తింటారు. థైరాయిడ్ ను తగ్గించుకోవాలంటే ఈ లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. తినుబండారాలకు, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉన్న పిల్లలకు మార్కెట్లో దొరికే బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు వగైరాలను కొంతకాలం పాటు దూరంగా ఉంచాలి. వాళ్ల జీవితమంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయక తప్పదు మరి.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు హై ప్రొటీన్ ఫుడ్ ను తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోసెలకు గుడ్ బై చెప్పేసి.. మొలకెత్తిన విత్తనాలు (Raw Food) తినడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఇవే తినాలా అంటే.. వారానికోసారి ఇష్టమైన టిఫిన్ ను లైట్ గా తీసుకోవచ్చు. అలాగే ఉదయం వేళలో రెండు క్యారెట్లు, ఒక బీట్ రూట్, కీర దోస, టమోటా లను కలిపి నీరు పోయకుండా గ్రైండ్ చేసి.. దానిని ఫిల్టర్ చేయగా వచ్చే జూస్ ను తాగాలి.

మధ్యాహ్నం వేళలో వైట్ రైస్ కు స్వస్తి చెప్పి.. రెండు పుల్కాలు, రెండు రకాల కూరలతో తినాలి. వీటిలో ఆకుకూరలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. బరువు తక్కువయ్యే థైరాయిడ్ ఉన్నవారు పుల్కాలకు బదులు వైట్ రైస్ తినాలి. డిన్నర్ విషయానికొస్తే.. రాత్రి వరకూ కాకుండా.. సాయంత్రం 5.30-6.30 సమయంలో ఫ్రూట్స్ తినాలి. బొప్పాయి, దానిమ్మ, జామకాయ, కర్భూజ వంటి పండ్లను తీసుకోవాలి. 7 గంటల తర్వాత ఇక ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఈ డైట్ ను ఆరునెలలపాటు క్రమం తప్పకుండా పాటిస్తే.. థైరాయిడ్ సమస్యకు జీవితకాలంపాటు మందులు వాడాల్సిన అవసరం ఉండదు.