Site icon HashtagU Telugu

Flaxseed Benefits: జుట్టు, చర్మానికి బలమిచ్చే గింజలు ఇవే

Flax Seeds Benefits

Flaxseeds

చర్మ సౌందర్యం.. నల్లని బలమైన జుట్టు.. కొలెస్ట్రాల్‌ కంట్రోల్.. వెయిట్ లాస్.. గుండెకు బలం.. మెదడుకు శక్తి ఈ ప్రయోజనాలన్నీ ఇచ్చే చిన్నపాటి గింజల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. అవే అవిసె గింజలు (Flaxseed)!! వాటి వల్ల కలిగే హెల్త్ బెనెఫిట్స్ పై డీటైల్స్ ఇవీ.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనితో పాటు కరగని ఫైబర్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. ఇది మీకు ఆరోగ్యకరం.

జుట్టు రాలే సమస్యకు చెక్

జుట్టు రాలే సమస్య ఉన్నవారికి అవిసె గింజలు దివ్యౌషధం. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి మీ జుట్టుకు పోషణనిస్తాయి. జుట్టు పొడవుగా, బలంగా ఉండాలంటే అవిసె గింజల్ని తినాలి.

మలబద్ధకం నుంచి ఉపశమనం

అవిసె గింజలలో చాలా ఫైబర్ ఉంటుంది.కాబట్టి అవిసె గింజలు మీకు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా, మలబద్ధకం సమస్య ఉన్నా… అవిసె గింజలు తినాలి. వాటిలోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకలి తగ్గిస్తాయి. ఫలితంగా బాడీ బరువు తగ్గుతుంది.

మెరిసే చర్మం

అవిసె గింజలు (Flaxseed) మీ చర్మాన్ని మృదువుగా, మచ్చలేనిదిగా మార్చడంలో సహాయపడుతాయి. ఇది చర్మానికి మెరుపును కూడా తీసుకురాగలదు. చర్మానికి తేమను అందించడం ద్వారా, పొడి చర్మానికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవడం వంటివి పోవాలంటే అవిసె గింజలు తినాలి.

కొలెస్ట్రాల్‌ కంట్రోల్

మనం ఇంతకు ముందే చెప్పినట్లుగా, అవిసె గింజలలో కరిగే ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు కంట్రోల్ లోకి 

అవిసె గింజల్లో నీటిలో కరిగే, కరగని… రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడతాయి. కొవ్వు కరిగిస్తాయి. చక్కెర నిల్వలను తగ్గిస్తాయి. మన శరీరానికి ఆరోగ్యకర కొవ్వును అవిసె గింజలు ఇస్తాయి.దీంతో అవి తిన్నాక.. మనకు చాలా సేపటి వరకు ఆకలి కాదు. అందువల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు అవిసె గింజలు తినాలి. కడుపులో మంటను కూడా ఇవి తగ్గిస్తాయి.

బ్రెయిన్ కు హెల్త్

అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌ని అల్ఫా లైనోలెనిక్ యాసిట్ (ALA) అంటారు. ఇవి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

అవిసె గింజలను (Flaxseed) ఎలా తినాలి?

మీరు ఒక టీస్పూన్ అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. వీటిని పచ్చిగా కూడా తినవచ్చు. కానీ రుచిని పెంచడానికి ఈ గింజలను 5 నిమిషాలు వేయించాలి. వేయించిన అవిసె గింజలను గ్రైండర్లో రుబ్బి.. ఈ పొడిని రోజూ ఒక చెంచా తీసుకోవచ్చు.

Also Read:  Akaashavani: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్ వర్క్ లో… మన ‘ఆకాశవాణి’

Exit mobile version