Good Sleep : ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఐదు చిట్కాలు..!!

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 08:30 PM IST

మంచి ఆరోగ్యం కావాలంటే కంటినిండా నిద్ర ఉండాలి. కొన్నిసార్లు నిద్ర లేచిన తర్వాత కూడా అలసటగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన నిద్రకు సంకేతం కాదు. రోజుకు 8 గంటల నిద్ర ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన నిద్ర పొందడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ చిట్కాలను అనుసరించండి.

గాడ్జెట్‌లకు దూరంగా ఉండండి:
నిద్రపోయే సమయంలో మొబైల్, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించకూడదు. గాడ్జెట్ల నుంచి వచ్చే హానికరమైన కిరణాలు కళ్లపై ప్రభావం చూపుతాయి. హాయిగా నిద్రపోవడం కష్టంగా మారుతుది. వాటికి బదులుగా, పడుకునే ముందు 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేయండి. ఇలా చేస్తే మీరు త్వరగా నిద్రపోతారు.

ఆలస్యంగా తినవద్దు:
రాత్రిపూట ఆలస్యంగా తినకూడదు. అలా తింటే నిద్ర సరిగా పట్టదు. ఎందుకంటే రాత్రిపూట జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి పడుకునే 2 గంటల ముందు తినండి. దీని వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు.

లైట్లను ఎంచుకోండి:
హాయిగా పడుకోవాలంటే వీలైనంత వరకు చీకటిలో పడుకోండి. బాగా నిద్రపడుతుంది. అలాగే వెలుతురులో పడుకున్నప్పుడు మెదడుకు విశ్రాంతి లభించదు. నిద్ర కూడా పట్టదు. చీకటిలో పడుకున్నప్పుడు నిద్రకు అవసరమైన మెలటిన్ అనే హార్మోన్ స్రవించి ఆరోగ్యవంతమైన నిద్రకు దారి తీస్తుంది.

మంచి నిద్ర కోసం చిట్కాలు:

1. కెఫిన్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండండి

2. కొంతమంది కాఫీ లేదా టీతో తమ రోజును ప్రారంభిస్తారు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత కెఫీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి.

3. మీరు పసుపు పాలు వంటి హెర్బల్ టీ, శంఖు పూల టీ వంటి ఫ్లవర్ టీ తాగవచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

4. నిద్రించే స్థానం సరిగ్గా ఉండాలి

5. మంచి నిద్ర పొందడానికి స్లీపింగ్ పొజిషన్, స్పేస్ కూడా ముఖ్యమైనవి. మీరు నిద్రపోకపోతే, స్థలాన్ని మార్చడానికి ప్రయత్నించండి. ఎత్తైన దిండ్లు ఉపయోగించవద్దు.

6. మంచం శుభ్రంగా ఉండాలి. బెడ్ షీట్లను కనీసం వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఉతకాలి. ఇది మీరు నిద్రపోయే ప్రతిసారీ తాజాదనాన్ని ఇస్తుంది. ఇలా చేస్తే హాయిగా నిద్ర వస్తుంది.