మామూలుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగా ఉండరని పచ్చి ఆకుకూరలు కాయగూరలు, పండ్లు వంటివి తింటూ ఉంటారు. అయితే కేవలం డేట్ ఫాలో అవ్వడం వల్ల మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పనులు చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెబుతున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే వీటితో పాటు ఇంకా ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుందట. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఆఫీసులో, ఇంట్లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మధుమేహం, గుండె సమస్యలు,మరణం వంటి వ్యాధులకు నిశ్చల జీవనశైలి ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటిగా చెబుతున్నారు. అందువల్ మీరు కూర్చునే సమయాన్ని తగ్గించడం చాలా అవసరం అని చెబుతున్నారు.కాగా 8 గంటల పాటు కుర్చీలో కూర్చోని పనిచేయడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయట. కాబట్టి అలాంటి వారు ప్రతి అది ఐదు నిమిషాలు లేదా గంటకు ఒక్కసారైనా సరే అలా కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిదని చెబుతున్నారు.
ప్రతి అరగంటకు ఐదు నిమిషాలు లేచి నడవడం వల్ల ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే చెడు పరిణామాలను తగ్గించుకోవచ్చట. కాగా ఇది రక్తంలో గ్లూకోజ్ , రక్తపోటు రెండింటినీ గణనీయంగా తగ్గిస్తుందట. కాబట్టి రోజంతా ఎంత బిజీగా ఉన్నా కూడా కొద్దిసేపు నడవడం వల్ల మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది అని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఒక పదివేల అడుగుల దూరం నడిస్తే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కాబట్టి తిని కూర్చోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తిని అలా కొద్దిసేపు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.