Bad Breath: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

చాలామందికి నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురితో మాట్లాడాలి అన్నా, నలుగురితో కలిసి

  • Written By:
  • Publish Date - October 28, 2022 / 08:30 AM IST

చాలామందికి నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురితో మాట్లాడాలి అన్నా, నలుగురితో కలిసి తిరగాలి అన్న నోటు దుర్వాసన కారణంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది శుభ్రంగా బ్రష్ చేసినప్పటికీ నోటి దుర్వాసన సమస్య ఇస్తూనే ఉంటుంది. దాంతో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వారు ఇబ్బంది పడతారేమో అని వారు భయపడుతూ గిల్టిగా ఫీల్ అవుతూ ఉంటారు. నోటి దుర్వాసనకు గల కారణాలు.. తక్కువ నీరు తాగడం, ఎక్కువగా తింటూ ఉండడం, దీర్ఘకాలిక మలబద్ధక సమస్య, ఎక్కువగా నిద్ర పోవడం లాంటివి నోటి దుర్వాసనకు కారణాలుగా చెప్పవచ్చు.

అయితే నోటి దుర్వాసన తో బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. మరి అందుకోసమే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకోవడంతో పాటు నాలుకను కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల రాత్రి సమయంలో మనం తిన్న ఆహారం లోని టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. కేవలం ఉదయం మాత్రమే కాకుండా రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత సోంపు తినడం అలవాటు చేసుకోవాలి.

సోంపు సుగంధ రుచినికలిగి ఉంటాయి. అంతేగాకుండా నోటి దుర్వాసనను తొలగించడానికి కూడా బాగా సహాయపడతాయి. అలాగే ఎప్పుడు భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. ఇలా భోజనం చేసిన వెంటనే నీటిని తాగడం వల్ల జీవక్రియను నెమ్మదిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత నోట్లో నీరు పోసుకొని పుక్కలించాలి. ఈ విధంగా చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. తగినంత నీటిని తాగాలి. శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు.