చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చేపలను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేపలను తినడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. అయితే చేపలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా చేపలు తినడం వల్ల కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. మళ్లీ చేపలు తింటే ఎలాంటి వ్యాధుల బారిన పడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చేపలు తినడం మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు రకాల సమస్యలు వస్తాయట. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా నీరు బాగా కలుషితమవుతున్నాయి. నదులు చెరువులు చివరికి సముద్రాలలోని మీరు కూడా కలుషితం అవుతున్నాయి. అలా చేపల కడుపులోకి పాదరసం, ఇతర రసాయనాలు ఇమిడిపోయి ఉంటాయి. అలా అవి ఉన్న క్రమంలోనే మనం మన కడుపులోకి ఆహార పదార్థంగా పంపిస్తుంటాం. దాంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తవచ్చు. చేపల వలన ముఖ్యంగా మెదడు పైన ప్రభావం పడుతుంది. మెదడుపైన, మానవుడి నాడీ వ్యవస్థ పైన ఈ వ్యాధుల బారిన చూపుతాయి.
ఈ నేపథ్యంలోనే చేపలను తీసుకునే క్రమంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్త వహించాలి. చేపలు అతిగా తినడం వలన మతి మరుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లిమిట్ గానే చేపలను తీసుకోవాలి. చేపలు అతిగా తీసుకోవడం వలన గర్భిణులపైన తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. గర్భిణులు చేపలు తీసుకుంటే కనుక అది తల్లి, బిడ్డ ఇద్దరిపైనా ప్రభావం చూపుతుంది. చేపలు ఎక్కువగా తినే వారిలో శరీరంలో రకరకాల మార్పులు జరిగి, వారు కేన్సర్ బారిన పడే చాన్సెస్ కూడా ఉంటాయి.