Site icon HashtagU Telugu

Figs Side Effects: అంజీర్ పండ్లు మితిమీరి తీసుకుంటే ఆ సమస్యలు తప్పవు?అంజీర్ పండ్లు మితిమీరి తీసుకుంటే ఆ సమస్యలు తప్పవు?

Figs Side Effects

Figs Side Effects

అంజీర్ పండ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో వీటివినియోగం పెరిగిపోవడంతో మార్కెట్లో మనకు ఇవి విరివిగా దొరుకుతున్నాయి. విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలంలో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అంజీర్లో ఇంకా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అంజీర్‌ పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి.

అంతేకాకుండా ఇందులో బాడీ శక్తిని పెంచే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి అంజీర్‌ ప్రతి రోజూ తినడం వల్ల కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మెదడు బూస్ట్‌ చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యల పెంచడానికి కూడా సహాయపడతాయి. మంచిదే కానీ మితిమీరి తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అంజీర్‌ను అతిగా తినడం వల్ల పొట్టలోని అల్సర్‌ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. అంజిర్ పండ్లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దీనిని అతిగా తినడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారీ తీయవచ్చు. అలాగే అంజీర్ ని ఎక్కువగా తినడం వల్ల కాలయ సమస్యలు రావచ్చు. అందుకే కాలేయ సమస్యలతో బాధపడేవారు అస్సలు వీటిని తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో కాలేయ సమస్యలకు దారి తీసే చాలా రకాల గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల కాలేయం నొప్పి, కాలేయ బలహీనత, ఇతర తీవ్ర సమస్యలకు దారీ తీయవచ్చు. అలాగే అతిగా అంజీర్‌ పండ్లను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలకు దారీ తీస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ బలహీనంగా మారే అవకాలు కూడా ఉన్నాయి. కొంత మందిలో అసిడిటీ సమస్యలకు కూడా దారీ తీయవచ్చని. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.