Winter: చలికాలంలో ఈ ఒక్కటి తినండి.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేయండి?

చలికాలం మొదలైంది. ఇప్పటికే  కొన్ని ప్రదేశాలలో చలి రాత్రి సమయంలో మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. పల్లెటూర్లలో

  • Written By:
  • Updated On - November 17, 2022 / 10:47 AM IST

చలికాలం మొదలైంది. ఇప్పటికే  కొన్ని ప్రదేశాలలో చలి రాత్రి సమయంలో మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. పల్లెటూర్లలో అయితే ఉదయం ఏడు, ఎనిమిది అవుతున్నా కూడా మంచు ఇంకా అలాగే ఉంటోంది. అయితే ఈ చలికాలంలో తొందరగా జలుబు జ్వరం వంటి వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. వీటినే సీజనల్ వ్యాధులు అని కూడా పిలుస్తూ ఉంటారు. వాతావరణ మార్పు వల్ల చలికాలంలో అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చలికాలంలో ఎక్కువగా బాక్టీరియా,వైరస్ లు వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

అయితే ప్రస్తుత రోజుల్లో వ్యాధులు రాకుండా ఉండాలి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే మనం నిత్యం మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మరి చలికాలంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో అంజీర్ పనులను తీసుకోవడం చాలా మంచిది. అంజీర్ పండ్లను సూపర్ ఫుడ్‌ గా చెబుతారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంజీర్ పండ్లలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఈ పండ్లలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి చలికాలంలో వచ్చే అనేక రకాల సీజనల్ వ్యాధులను దరిచేరకుండా ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి.

అంతే కాదండోయ్ ఈ అంజీర్ పనులను చలికాలంలో తినడం వల్ల ఈరోజు నిరోధక శక్తిని పెంచుతాయి. చలిని దూరం చేసి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. దగ్గును కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు శ్వాసకోస వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఈ అంజీర్ పండ్లలో విటమిన్లు ప్రోటీన్ ఫైబర్ కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అంజీర పండ్లను తీసుకోవడం వల్ల కఫం, గొంతునొప్పి,దగ్గు సమస్యలు దూరం అవుతాయి. అలాగే చలికాలంలో ఈ పండ్లు తినడం వల్ల చర్మం పొడిబారకుండా చర్మాన్ని ఎప్పుడు తేమగా ఉంచుతాయి.