Site icon HashtagU Telugu

Fenugreek: మీరు ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మెంతులు అస్సలు తినకండి?

Fenugreek

Fenugreek

మన వంటింట్లో దొరికే వాటిలో మందులు కూడా ఒకటి. అయితే మెంతులు రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మెంతులతో పాటు మెంతి ఆకుకూర కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. మెంతుల్లో ఫైబర్, ప్రొటీన్, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తొందరగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలి అనుకున్న వారికి మెంతులు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మెంతులు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

చర్మ సౌందర్యానికి అలాగే జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం,ఐరన్,ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ,సి కె,బి, రాగి,జింక్, ఫైబర్,అధికార పోషకాలు ఉంటాయి. ఈ మెంతులు వంటకాల రుచిని పెంచడంతో పాటుగా మధుమేహానికి కూడా నియంత్రించగలవు. మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే మెంతులు ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు, కొంతమంది మెంతులను అస్సలు తీసుకోకూడదు.

మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు మెంతులు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భంతో ఉన్న వారు మెంతులు తినకూడదట. ఎందుకంటె మెంతులు కడుపులో పెరుగుతున్న పిండం పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే బిడ్డకు వైకల్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మెంతులను అస్సలు తీసుకోకూడదు. అలాగే శ్వాస కోస సమస్యలున్నవారు మెంతులు ఉంపయోగించకూడదు. అలాగే అధిక రక్తపోటుతో ఉన్నావారు కూడా మెంతులను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మెంతులు బీపీని మరింత పెంచుతాయి. పిల్లలకు కూడా మెంతులను ఎక్కువగా పెట్టకూడదట.

Exit mobile version