Fenugreek: మధుమేహం ఉన్నవారు మెంతులను ఉపయోగించవచ్చా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్న పెద్ద

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు డయాబెటిస్ కారణంగా ఏది తినాలని కూడా కొంచెం వెనకడుగు వేస్తూ భయపడుతూ ఉంటారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియక తికమక పడుతూ అయోమయంలో ఉంటారు. అయితే షుగర్ వ్యాధిని నియంత్రించుకోవడం కోసం మార్కెట్లోకి ఎన్నో రకాల మెడిసిన్స్ వచ్చినప్పటికీ దానిని పూర్తి స్థాయిలో నశింప చేయడానిక ఇప్పటివరకు ఎక్కడ శాస్త్రవేత్తలు సంబంధించిన మందు ని కనుగొనలేదు. అయితే డయాబెటిస్ పేషెంట్లు చాలామంది మెంతులు తీసుకోవచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు.

మరి డయాబెటిస్ ఉన్నవారు మెంతులను ఏ విధంగా తీసుకోవాలి ఒకవేళ తీసుకోవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహం ఉన్నవారికి మెంతిగింజలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. టీ తాగకుండా రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి మెంతులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. రాత్రిపూట మెంతులను ఆ నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. మీ ఆహారంలో మెంతులు చేర్చుకునే ముందు మీకు ఆహార సంబంధిత అలెర్జీలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకుని ఉపయోగించాలి.

చాలామందికి మెంతులు ఉపయోగించినప్పుడు కొన్ని రకాల అలర్జీలు వస్తూ ఉంటాయి. వంటలో ఉపయోగించే మెంతులు సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. అలాగని మెంతులను ఎక్కువ మోతాదులో తీసుకుంటేఅది శరీరం పై దుష్ప్రభావాలు చూపిస్తాయి. తద్వారా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెంతి గింజలు చేదు, వగరు రుచిని కలిగి ఉంటాయి. పెరుగులో మెంతిపొడి కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో ఓ స్పూన్ మెంతి పొడి వేసుకుని తాగవచ్చు.