ప్రస్తుతం జనాభా అంత ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఆరోగ్యానికి సంబంధించిన పొరపాట్లు చేస్తున్నారు. సరైన ఫుడ్ తీసుకోకుండా రోడ్ ఫై ఏదికనిపిస్తే అది కడుపులో వేస్తూ అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఆకు కూరలను చాలామంది దూరం పెడుతున్నారు. చిన్న వారికీ అలవాటు చేయడమే కాదు కనీసం పెద్దవారు సైతం వారంలో ఒక్కసారి కూడా తినడం లేదు. దీంతో పలు వ్యాధుల బారిన పడి హాస్పటల్స్ లలో లక్షల బిల్లులు కట్టేస్తున్నారు. ముఖ్యంగా మెంతి ఆకులు (Fenugreek) చాలామంది దూరం పెడతారు కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మెంతి ఆకుల ప్రయోజనాలు (Fenugreek Benefits) చూస్తే..
మెంతికూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి-కాంప్లెక్స్, క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తప్పకుండా తీసుకోవడం ద్వారా మన శరీరానికి పోషకాలు అందుతాయి. అలాగే ఈ ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు… వ్యాధులతో పోరాడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతికూర నమలడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
మెంతికూరలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె వేగాన్ని అదుపులో ఉంచుతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత రుగ్మతలను కూడా నివారిస్తుంది. ఇక ఇందులో విటమిన్ ఎ, ఇ పుష్కలంగా ఉండడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అలెర్జీలను కూడా తగ్గిస్తుంది. అలాగే మెటబాలిజంను పెంచడంలో మెంతులు సహకరిస్తాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది. రాత్రి సమయంలో 100 గ్రాముల మెంతి ఆకులను నీటిలో ఉంచి, మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తినండి
ప్రేగు సమస్యలను నివారిస్తుంది.
Read Also : BRS : మరో వికెట్ అవుట్..రేపు కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే