Vitamin D3 : బాడీలో విటమిన్ డి3 అవసరమైనంత లేకపోతే దానినే విటమిన్ డి3 లోపం అంటారు. ఈ సమస్య ఉంటే మన బాడీలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు, పెద్దవారు కాల్షియం సరిగ్గా తీసుకోకపోయినా, తీసుకున్న కాల్షియం బాడీకి సరిగా అబ్జార్బ్ అవ్వకపోయినా ఆస్టియోమలాసియాకి కారణమవుతుంది. దీని వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఎముకలు, మొత్తం ఆరోగ్యాన్ని పాడుతుంది. కాబట్టి, దీనిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం.
బాడీకి అన్నీ విటమిన్స్ సరిగ్గా అందాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాం. అందులో భాగంగా విటమిన్ డి3 లోపం ఉంటే కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి దానిని కూడా ముందుగానే గుర్తించాలి. విటమిన్ డి3 తగ్గితే ముందుగానే అలర్ట్ అవ్వాలి. లేదంటే భవిష్యత్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రికెట్స్, ఆస్టియోమలాసియా, హైపోకాల్సిమియా వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి, దీనిని ముందుగానే గుర్తించాలి. దీని గురించే డాక్టర్ భగత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. అందులో విటమిన్ డి3 లోపం లక్షణాలు, తగ్గేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెబుతున్నారు.
బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండడం
ఏవైనా బరువులు మోసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఎక్కువగా అలసిపోయినప్పుడు మనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దీని వల్ల సమస్యలొస్తాయి. కాబట్టి, బాడీ పెయిన్స్ ఉన్నా, బరువు పెరిగినా కూడా మన బాడీలో విటమిన్ డి తగ్గినట్లుగా గుర్తించాలి.
జుట్టు ఎక్కువగా రాలడం
జుట్టు చాలా కారణాల వల్ల రాలుతుంది. అందులో ఒకటే విటమిన్ డి3 లోపం. మన బాడీలో విటమిన్ డి తక్కువగా గనుక ఉంటే ఎంత పోషకాహారం తీసుకుని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలుతూనే ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా రాలుతుంటే నిరక్ల్యం చేయక ముందుగానే సమస్యని పరీక్షించుకోవాలి.
ఊరికే అలసిపోవడం
పనులు చేయకుండానే, ఎలాంటి జ్వరం వంటివి రాకుండానే ఊరికే అలసిపోతుంటే మనలో విటమిన్స్ తగ్గినట్లుగా గుర్తించాలి. ఊరికే అలసిపోతుంటే విటమిన్ డి తగ్గినట్లుగా గుర్తించాలి. ఓ సారి చెక్ చేసుకుంటే మనకి ఈ లోపం గురించి తెలుస్తుంది.
ఎనర్జీ లేకపోవడం కూడా లక్షణమే
ఊరికే అలసిపోయినా, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మన బాడీ సహకరించుకపోయినా కూడా మన బాడీలో చాలా వరకూ విటమిన్ డి3 తగ్గినట్లుగా గుర్తించాలి. దీని వల్ల చాలా వరకూ బాడీలో నీరసం వస్తుంది. అస్సలు ఎనర్జీ ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ఎనర్జీ తగ్గితే ఈ సమస్యని గుర్తించండి.
మూడిగా, ఆందోళనగా అనిపించడం
ఎప్పుడు కూడా మూడీగా అనిపించడం, ఏం తోచకపోవడం, ఊరికే అలసిపోవడం, డిప్రెషన్ బాధగా అనిపించినా కూడా బాడీలో విటమిన్ డి3 తగ్గినట్లుగా గుర్తించాలి. ఇలాంటి లక్షణాలుని ముందుగా గుర్తించి మనం సరైన టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలన్నీ కూడా మన బాడీలో విటమిన్ డి3 లోపం ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి.
ప్రతి వంద మందిలో 80 మందికి విటమిన్ డి3 లోపం ఉంటుంది. దీనిని ముందుగానే గుర్తించాలి.
విటమిన్ డి3 లోపానికి కారణాలు
- ఎండలో ఉండకపోవడం, నీడపట్టునే పనిచేయడం.
- సన్‌స్క్రీన్ రాయడం, పూర్తిగా కవర్ చేసే బట్టలు వేసుకోవడం.
- విటమిన్ డి3 ఉండే ఆహారం తీసుకోకపోవడం. ఇలాంటి కారణాలన్నీ కూడా విటమిన్ డి3 లోపం ఉంటే కనిపించే లక్షణాలే. ఇవి మనలో గనుక కనిపిస్తే అలర్ట్ అవ్వాలి.
- ఏ టెస్ట్‌తో సమస్యని కనిపెట్టొచ్చు
25-OH విటమిన్ డి బ్లడ్ టెస్ట్‌ని చేయించుకోవాలి. ఇందులో మనం సమస్యని గుర్తించాలి. సమస్య ఉందని గుర్తిస్తే డాక్టర్ సలహాతో మెడికేషన్ తీసుకోవాలి.
వీటితో పాటు విటమిన్ డి3 పొందేందుకు
- రోజూ 10 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఏ టైమ్‌లో అయినా ఎండలో ఉండాలి.
- విటమిన్ డి3 ఎక్కువగా ఉండే గుడ్డు పచ్చసొన తినాలి.
- ఫ్యాటీ ఫిష్ తినాలి. సాల్మన్, సార్డిన్ తీసుకోవాలి.
- మష్రూమ్స్ తీసుకోవాలి.
- పోర్టిఫైడ్ మిల్క్, పెరుగు తీసుకోవాలి.
- ఇలా చేస్తే సమస్య నుంచి బయటపడొచ్చు.
