Child Food: ఈ ఆరు పదార్ధాలను మీ పిల్లలకు రోజు తినిపించడం వల్ల కాల్షియం లోపం ఉండదు

చిన్న పిల్లలకు పోషకాహారం ముఖ్యం. ఎందుకంటే వయసు పెరిగే కొద్ది కాల్షియం వంటివి ప్రభావం చూపుతాయి. అందుకే కాల్షియం అధికంగా ఉండే పోషక, ఆహార పదార్ధాలను పిల్లలకు

చిన్న పిల్లలకు (Child) పోషకాహారం ముఖ్యం. ఎందుకంటే వయసు పెరిగే కొద్ది కాల్షియం వంటివి ప్రభావం చూపుతాయి. అందుకే కాల్షియం అధికంగా ఉండే పోషక, ఆహార పదార్ధాలను పిల్లలకు రోజువారి భోజనంలో వడ్డిస్తే కాల్షియం లోపానికి ఆదిలోనే చెక్‌ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పసివాళ్లలో కాల్షియం లోపం కనిపిస్తోంది. పిల్లల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపించే కాల్షియం పర్సంటేజ్‌ బ్యాలెన్స్ చేసేందుకు నిత్యం వారికి ఆహరంలో తప్పకుండా కూరగాయల్లో ఆకు కూరల్లో పాలకూర పిల్లలకు తినిపించడం మంచిదని న్యూట్రిషన్స్‌ చెబుతున్నారు. పాలకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని అధిగమించడంతో పాటు విటమిన్ సి, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల ఎదుగుదలకు తోడ్పడే మరో వెజిటబుల్ బ్రొకోలి. ఇందులో కూడా విటమిన్ సి, కే లతో పాటు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిత్యం పిల్లలకు (Child) తినిపించడం వల్ల చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. కాల్షియం లోపం కారణంగా నీరసతో పాటు వ్యధి నిరోధకశక్తి కూడా తగ్గుతుంది. ఫలితంగా పిల్లల్లో ఎదిగే లక్షణాలు తగ్గుతాయి. అందుకే పసివాళ్లకు నిత్యం సోయాబీన్ పెట్టాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలలో సోయాబీన్స్ ఒకటి. ప్రతీ 100 గ్రాముల సోయాబీన్స్ లో దాదాపు 250 ఎంజీ పైనే కాల్షియం ఉంటుంది. ఆకు కూరలు, కూరగాయలతో పాటు పెరుగు పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్ పెడతుందంటున్నారు నిపుణులు. పిల్లలకు రోజుకు ఒక స్పూన్ పెరుగు తినిపిస్తే వాటి ద్వారా అవసరమైన పోషకాలు శరీరంలోకి చేరుతాయంటున్నారు. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుందని, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పూట నాన బెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే పిల్లలకు తినిపించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకో గుప్పెడు బాదాం పప్పుతో పిల్లల ఎముకలు ధృఢంగా తయారవడంతో పాటు మానసికంగా కూడా పిల్లలు బలంగా తయారవుతారంటున్నారు. వీటితో పాటు ఇంట్లో తయారుచేసిన చీజ్‌ను పిల్లల ఆహారం ద్వారా ఇవ్వడం వల్ల వారిలో కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు. కాల్షియంతో పాటు పైబర్ ఎక్కువగా ఉండే కాయ ధాన్యాలను పిల్లలకు రోజూ తినిపించాలి. దీనివల్ల పిల్లల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

Also Read:  Snoring Problem: గురక సమస్యకు ఈ చిట్కాలు పాటించండి..