Fatty Liver: ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై ద్యాస ఉండటం లేదు. డబ్బు సంపాదించే క్రమంలో అనారోగ్యం పాలవుతున్నారు.ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపకపోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. దీని వల్ల కాలేయంలో ఫ్యాటీ లివర్ (fatty liver) , వాపు మరియు ఇన్ఫెక్షన్ వంటి అనేక అంశాలు కాలేయాన్ని పాడు చేస్తాయి. ఎదుర్కొంటున్న కాలేయ సంబంధిత సమస్యలు మరియు వాటి పరిష్కారాలను చూద్దాం.
ముందుగా తెలుసుకోవాల్సింది మన కాలేయం ఎలా పనిచేస్తుందో గమనించాలి. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే సమస్య బయటపడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే కాలేయంలో ఎక్కడో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా నోటి దుర్వాసన, కళ్ల కింద నల్లటి మచ్చలు, కడుపులో నిరంతరం నొప్పి, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, చర్మంపై తెల్లటి మచ్చలు, మూత్రం లేదా మలం ముదురు రంగులోకి మారడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.(health tips)
ఈ సమస్యలే కాకుండా ఒక్కోసారి మనిషి జీర్ణవ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి కాలేయం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా సార్లు కాలేయ సమస్యల కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి, వీటిని కాలేయ మచ్చలు అని కూడా పిలుస్తారు. మన కాలేయం సరిగా పనిచేయకపోతే నోటి దుర్వాసన కూడా రావడం ప్రారంభమవుతుంది. కాలేయ వ్యాధిలో అత్యంత ముఖ్యమైన విషయం దాని సకాలంలో గుర్తించడం. కాలేయం ఏ దశలో పాడైపోయిందో లేదా కొవ్వుగా ఉన్నదో తెలిసే వరకు మందులు తీసుకోకపోవడమే మంచిది. కాలేయ పరిస్థితిని తెలుసుకున్న తర్వాతే వైద్యులు మందులు ఇస్తారు.
కాలేయం సిర్రోసిస్‌కు చేరుకోకపోతే ఇంటి నివారణలతో కూడా నయం చేసుకోవచ్చు. దీనికి కాఫీ పౌడర్ చాలా మంచి పరిష్కారం. పాలు, పంచదార లేకుండా కాఫీ తీసుకుంటే అందులోని కొవ్వును తొలగించి మన కాలేయాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసుపు మన కాలేయాన్ని నయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెపటైటిస్ బి మరియు సికి కారణమయ్యే వైరస్‌ల పెరుగుదలను పసుపు నిరోధిస్తుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్‌ని తేనెతో కలిపి తీసుకుంటే ఇది గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఉసిరి, బొప్పాయి, మామిడి వంటి పండ్లలో కూడా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వేయించిన ఆహారాన్ని తినడం మానేసి సాధారణ ఆహారాన్ని తినడం ప్రారంభిస్తే వారు కాలేయ సమస్యల నుండి చాలా వరకు బయటపడవచ్చు.
Also Read: Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో చివరి ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు