Site icon HashtagU Telugu

Eye Sight: ఈ ఒక్కటి తింటే చాలు రాత్రికి రాత్రే కంటి చూపు పెరగడం కాయం?

Mixcollage 14 Feb 2024 12 03 Pm 5946

Mixcollage 14 Feb 2024 12 03 Pm 5946

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఆహార పదార్థాలు. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. కంటి సమస్యలు వస్తే ఇక జీవితం అంత చీకటి మయం అవుతుంది. అయితే కంటి చూపు సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తగా పడడం కంటే రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అలాగే కంటి చూపు మెరుగవ్వడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం 4 బాదం గింజలు తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. అలా నానిన బాదం గింజల పొట్టు తీసి చిన్న రోట్లో వేసి మెత్తగా ముద్దల చేయాలి. ఈ బాదం కంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్, మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కంటిని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. మంచి జ్ఞాపకశక్తి కూడా వస్తుంది. అలాగే అనేక రకాల రోగాల బారి నుంచి కూడా కాపాడుతుంది. ఇప్పుడు మన రెండవ ఇంగ్రిడియంట్ మిరియాలు. ఒక ఐదు వరకు మిరియాలు తీసుకుని ఇవి కూడా వేసి బాగా దంచి మెత్తగా ముద్దగా చేయాలి. అలాగే పట్టిక బెల్లం కూడా తీసుకోవాలి. ఒక స్పూన్ వరకు తీసుకొని ఈ చిన్న రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి.

కంటి చూపులు మెరుగుపరచడంలో నూటికి నూరు శాతం హెల్ప్ చేస్తాయి. పాలల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ పాలను మనం తయారు చేసి పెట్టుకున్న బాదం పట్టిగా అలాగే మిరియాల పేస్టుని ఈ గోరువెచ్చని పాలలో వేసి బాగా కలపాలి. ఇక ఈ పాలను ప్రతిరోజు ఉదయం మాత్రమే తీసుకోవాలి. మీకు కుదిరితే రోజుకు రెండుసార్ల తీసుకుంటే అనేక రకాల కంటి సమస్యలను కూడా మన కంటిని కాపాడుకోవచ్చు. కంటి చూపు మెరుగుపడే కొన్ని ఆకుకూరలు, కూరగాయలు పళ్ళు కూడా తీసుకోవడం చాలా ఉత్తమం. కంటి చూపు సమస్యలు ఉన్నవారు మునగాకు, పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్ ని కూడా తీసుకుంటూ ఉండాలి.