Site icon HashtagU Telugu

Eye Exercise : కళ్లపై ఒత్తిడి ఎక్కువవుతుందా ? ఈ చిన్న వ్యాయామాలు చేస్తే సరి

eye strain

eye strain

Eye Exercise : ఉదయం లేచిన దగ్గర్నుండి.. రాత్రి పడుకునేంత వరకూ.. మన శరీరంలో ఏదొక అవయవానికి ఎంతోకొంత రెస్ట్ ఉంటుందేమో కానీ.. కళ్లకు మాత్రం రెస్ట్ ఉండదు. పడుకున్నపుడు తప్ప.. మిగతా అన్ని సమయాల్లోనూ కళ్లు పనిచేస్తూనే ఉండాలి. పడుకున్నాక.. కంటినిండా నిద్రపోతామా అంటే.. అదీ కాదు. అంతా సగం నిద్ర. రోజుకు 7 గంటలపాటు ఉండాల్సిన నిద్ర అందులో సగానికి తగ్గిపోతోంది. కారణం ఏదైనా.. ఫలితంగా కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది.

కళ్లపై ఒత్తిడి ఎక్కువైతే చూపు త్వరగా మందగించే ప్రమాదం ఉదంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు టీవీ చూసినా, అదే పనిగా ల్యాప్ టాప్ ల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చున్నా కళ్లపై తీవ్రఒత్తిడి ఉంటుంది. కంటి నరాలు బలహీన పడి క్రమంలో చూపు మందగించడం మొదలువుతుంది. 2022, నవంబర్ వరకూ ఉన్న జనాభా లెక్కల ప్రకారం.. ప్రపంచంలో 8 బిలియన్ మంది ఉండగా.. వారిలో 285 మిలియన్ మందికి పైగా దృష్టిలోపంతో బాధపడుతున్నారు. మరో 39 మిలియన్ మందికి పూర్తిగా కంటిచూపు లేదు.

శరీరానికి వ్యాయామాలు ఉన్నట్లే.. కళ్లపై ఒత్తిడిని, కంటి సమస్యలను తగ్గించే వ్యాయామాలు కూడా ఉన్నాయి.

రెండు అరచేతుల్ని కలిపి రుద్ది.. వాటిని మూసి ఉంచిన కళ్లపై పెట్టుకుంటే.. ఆ వేడి కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ల్యాప్ టాప్ ల ముందు కూర్చుని పనిచేసేటపుడు కనురెప్పల్ని మనకు తెలియకుండానే ఎక్కువసార్లు బ్లింక్ చేయలేం. మిగతా సమయాల్లో కళ్లను ఎక్కువసేపు బ్లింక్ చేస్తే.. నరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

ఆఫీస్ వర్క్ లో ఉన్నపుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు మీకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూస్తూ ఉండాలి. ఇలా చేస్తే దృష్టిలోపం సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.

మెత్తటి క్లాత్ ను ఐస్ వాటర్ లో తడిపి.. దానితో కంటి చుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ నిదానంగా మసాజ్ చేస్తే.. కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే త్వరగా నల్లటి వలయాలు రాకుండా ఉంటాయి. పుండ్లు పడటం, కళ్ల మంటల సమస్యలు కూడా తగ్గుతాయి.

Exit mobile version