Site icon HashtagU Telugu

Health Problems: రాత్రిపూట ఎక్కువగా టాయ్ లెట్ కు వెళ్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Health Problems

Health Problems

సాధారణంగా రాత్రి సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే కంటి నిండా నిద్రపోతుంటారు. ఇంకొందరు కొన్ని కొన్ని కారణాలవల్ల సరిగ్గా నిద్ర లేక బాధపడుతూ ఉంటారు. అటువంటి కారణాలలో మూత్ర విసర్జన కారణం కూడా ఒకటి. చాలామందిని రాత్రి సమయంలో మూత్ర విసర్జన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రాత్రిలో చాలాసార్లు మూత్ర విసర్జన కోసం బెడ్ రూమ్ లోకి వాష్ రూమ్ లోకి తిరుగుతూ ఉంటారు. దాంతో వారితో పాటు పక్కన పడుకునే వారికి కూడా నిద్రకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. కొంతమంది పడుకునేటప్పుడు ఒక్కసారి మూత్ర విసర్జన చేస్తే ఆ తర్వాత మరుసటి రోజు వరకు ఎంతో ప్రశాంతంగా పడుకుంటూ ఉంటారు.

మూత్ర విసర్జనకు పదేపదే ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది? అదేమైనా సమస్యనా అన్న విషయాల్లోకి వెళితే.. సాధారణంగా వృద్ధులు రాత్రిళ్లు సరిగా నిద్రించరు. రెండు నుంచి నాలుగైదు సార్లు లేస్తారు. ఎందుకంటే వీరికి వయస్సు మీద పడుతున్న కొద్ది నిద్ర తగ్గిపోతుంది. వయసుకు తోడు పదేపదే మూత్ర విసర్జనకు లేస్తున్నారు అంటే ఏదో సమస్య ఉండే ఉంటుంది. రాత్రిపూట తరచుగా యూరిన్ చేయడాన్ని నోక్టురియా అంటారు. అధిక రక్తపోటును ఎదుర్కొంటున్న వారికీ ఇచ్చే యూరిన్ టాబ్లెట్స్ కూడా నోక్టురియా సమస్యకు దారితీస్తుంది. అందుకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టక తరచూ మూత్రవిసర్జన చేయడానికి లేవాల్సి వస్తుంది.

రాత్రి సమయంలో పడుకునేటప్పుడు వీలైనంతవరకు ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. మరి ముఖ్యంగా కెఫిన్, ఆల్కహాల్, శీతల పానీయాలు అధికంగా తీసుకోవడం ఈ సమస్యను ఎక్కువగా చేస్తుంది. ఇవి శరీరంలో సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయడానికి కారణం కావొచ్చు. అందుకే అధికంగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.