Site icon HashtagU Telugu

Egg: గర్భిణీ స్త్రీలు కోడిగుడ్లు తినవచ్చా.. తింటే ఎన్ని తినాలో తెలుసా?

Mixcollage 02 Jul 2024 07 50 Am 7863

Mixcollage 02 Jul 2024 07 50 Am 7863

కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా కోడిగుడ్డుని తీసుకోవచ్చు. ఇందులో అధిక పోటీన్లు, క్రొవ్వుక
లతో పాటు ఎన్నో రకాల విటమిన్ ఖనిజాలు లభిస్తాయి. చాలా మంది కోడిగుడ్డును వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. కానీ ఉడకపెట్టిన గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వైద్యులు.

ఇలా ఉడకపెట్టిన కోడిగుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తింటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది గర్భిణీ స్త్రీలు కోడిగుడ్డు తినవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీలు గుడ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్లలో ప్రోటీన్లతో పాటుగా, విటమిన్ బి 12, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, రాగి, మెగ్నీషియం, సెలీనియం వంటి ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

కానీ పొరపాటున కూడా గర్భిణీ స్త్రీలు పచ్చి కోడి గుడ్లు తినకూడదు. అలాగే గర్భిణీలు గుడ్లు తినాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మంచిది. ఉదయం పూట మెటబాలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తినడం వల్ల అజీర్థి సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ సమయంలో గుడ్లను మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే గుడ్లను తక్కువ మోతాదులో తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.