పచ్చి బఠాణి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాట్ ఫుడ్ లో చాలా రకాల కూరల్లో కూడా పచ్చి బఠాణిని ఉపయోగిస్తూ ఉంటారు. పచ్చి బఠానీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీవక్రియ సక్రమంగా జరిగేందుకు ఎంతో బాగా ఉపయోగపడతాయట. అలాగే పచ్చిబఠానీలు గుండె మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పచ్చిబఠానీలు ఎంతో మేలు చేస్తాయట. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట.
పచ్చి బఠానీలలో ఐరన్, జింక్, మాంగనీస్ , రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పచ్చి బఠానీలు గుండె, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్తున్నారు వైద్యులు. కాగా బఠానీ చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పచ్చి బఠానీలను గ్రైండ్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. పచ్చి బఠానీలలో ఉండే పాలీమియోథల్లనమైడ్ అల్జీమర్స్ తో పోరాడటానికి ఉపయోగపడుతుందట. అలాగే బఠానీల్లో ఉండే విటమిన్ ఎ,ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చలిలో పెదవులు, మడమలు పగిలిపోవడాన్ని తగ్గిస్తాయి.
పచ్చి బఠానీలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. అయితే పచ్చి పఠానీ ఎక్కువగా తింటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని అందుకే తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. కాగా పచ్చి బఠానీలు పోషకాలతో నిండి ఉంటాయి. కానీ వాటిలో కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ కూడా ఉన్నాయి. పచ్చి బఠానీలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ శరీరంలో ఇనుము, కాల్షియం, జింక్ శోషణను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీలను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుందట. పచ్చి బఠానీ లలో లెక్టిన్, ఫైటిక్ వంటి కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి వాయువు, గాలితో ఉబ్బరంకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి.