డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రోటీన్స్ విటమిన్స్ క్యాలరీలు అందుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బాదంలో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. పోషకాహార లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి ఒక్కరూ రోజూ బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
అయితే బాదంపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ బాదంపప్పును తింటున్న సమయంలో వాతావరణ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చలికాలంలో కొన్ని రకాల జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు శరీరంలో ఉష్ణోగ్రత కూడా పడిపోతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో బాదంపప్పును తినడం వల్ల శరీరం వెచ్చగా అది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చలికాలంలో బాదంపప్పును వేయించి కూడా తినవచ్చు.
ఆ విధంగా చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు శరీరానికి సమంగా అందుతాయి. ఆ వేయించిన బాదంపప్పులకు కాస్త నెయ్యిని కూడా కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యంగా తో పాటు రుచికరంగా కూడా ఉంటాయి. వేయించి తినడం ఇష్టపడని వారు పొడిగా చేసుకుని పాలలో కలుపుకొని తాగవచ్చు. బాదం పొడిని వారానికి మూడుసార్లు పాలలో కలుపుకొని తాగడం మంచిది. అలాగే బాదంపప్పును పాయసంలో కూడా కలుపుకొని తినవచ్చు. కాబట్టి చలికాలంలో బాదంపప్పును తినడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందడంతో పాటుగా శరీరం వెచ్చగా ఉంటుంది.