Fruits నిపుణులు పండ్లు తిన్నాక నీళ్లు తాగొద్దంటున్నారు. ఎందుకంటే..

పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు తెలుసు. పండ్లలోని పోషకాలు.. అనారోగ్యాలు దరి చేరకుండా రక్షిస్తాయి. పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన

పండ్లు (Fruits) మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు తెలుసు. పండ్లలోని పోషకాలు.. అనారోగ్యాలు దరి చేరకుండా రక్షిస్తాయి. పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. పండ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. వీటిలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కానీ, పండ్లు (Fruits) తిన్న వెంటనే.. నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు కారణంగా జీర్ణవ్యవస్థ మందగించి.. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్. శ్వేతా మహాదిక్ పండ్లు తిన్న తర్వాత కలిగే దుష్ప్రభావాల గురించి మనతో షేర్‌ చేసుకున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

గ్యాస్ట్రిక్‌ సమస్య ఎదురవుతుంది:

పండ్లలో చక్కెర, ఈస్ట్‌ ఎక్కువగా ఉంటుంది. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలు ప్రశాంతంగా ఉంటాయి. కడుపులో కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్స్‌‌ ఉత్పత్తి అవుతాయి. దీని కారణంగా గ్యాస్ట్రిక్‌‌‌‌ సమస్య వచ్చే అవకాశం ఉంది.

pH స్థాయిలపై ప్రభావం పడుతుంది:

పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. పుచ్చకాయ, కర్బూజా,కీరా, నారింజ , స్ట్రాబెర్రీ తిన్న తర్వాత.. నీళ్లు తాగితే శరీరంలోని జీర్ణవ్యవస్థను దెబ్బతీసేలా చేస్తాయి. పండ్లు తిన్నా తర్వాత.. నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థలోని pH స్థాయి మారుతుంది. దీనికారణంగా.. కడుపులో యాసిడ్స్‌ తక్కుగా విడుదల అవుతాయి. దీని వల్ల.. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది:

పండ్లలోని నీటి పరిమాణం, పండ్లు తిన్న తర్వాత మనం త్రాగే నీటి పరిమాణం జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది గ్యాస్ట్రిక్, ఎసిడిటీని పెంచుతుంది. పండ్లు తిన్న తర్వాత ఒక గంట వరకు నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణరసాలను డైల్యూట్‌ చేస్తుంది:

పండు తిన్న వెంటనే నీరు త్రాగితే.. కడుపులోని జీర్ణ రసాలు పలుచగా అవుతాయి. దీనికారణంగా కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి.

బ్లడ్‌ షుగర్స్‌ పెరుగుతాయి:

పండ్లు (Fruits) తిన్న తర్వాత నీళ్లు తాగితే.. జీర్ణవ్యవస్థ క్రమంగా మందగిస్తుంది. జీర్ణం కాని ఆహారం చాలా వరకు కడుపులో మిగిలిపోతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇది ఇన్సులిన్‌ బ్యాలెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్‌, ఊబకాయం ముప్పు పెరుగుతుంది.

Also Read:  Holi: హోలీ పూర్ణిమలోని అధ్యాత్మక మన్మథ రహస్యం