ఈ రోజుల్లో పదిమందిలో ఆరుగురు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే డయాబెటిస్ రావడానికి గల కారణం మన జీవనశైలి మన ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. అయితే డయాబెటిస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి అని చాలా వరకు అనేక రకాల ఆహార పదార్థాలను తినకుండా మానేస్తూ ఉంటారు. షుగర్ అదుపులో లేకపోతే గుండె జబ్బులు, కిడ్నీసమస్యల నుంచి రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది.
అయితే పర్సనల్ కేర్ తో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం సులభమే. అయితే మధుమేహం ఉన్నవారు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు నాలుగు రకాల పనులు చేస్తే తప్పకుండా మధుమేహం అదుపులో ఉంటుందట. మరి ఆ నాలుగు రకాల పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండిన చామంతి పువ్వులతో తయారు చేసిన టీ ని డయాబెటిస్ ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు తాగితే చాలా మంచిది. బాదంలో పోషకాలు పుష్కలం. రాత్రి పడుకునే ముందు 7 నాన బెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మెంతులు డయాబెటిస్ నిర్వహణలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెంతులు హైపోగ్లైసిమిక్ లక్షణాలు కలిగి ఉంటాయి.
మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. నానబెట్టిన మెంతులు రాత్రి నిద్రకు ముందు తింటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. యోగాలో వజ్రాసనం డయాబెటిస్ నిర్వహణలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నిద్రపోయే ముందు వజ్రాసనం వెయ్యడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి రెండూ కూడా అదుపులో ఉంటాయి. అంతే కాదు రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం, శరీర బరువు నియంత్రణలో పెట్టుకోవడం, పొగాకు మానెయ్యడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివన్నీంటితో డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవచ్చు.