Air-Conditioner : AC ఎక్కువగా వాడితే.. అనారోగ్య సమస్యలు తప్పవు..

ఇప్పుడు ఎండాకాలంలో అందరూ ఇళ్లల్లో ఉండి చల్లదనం కోసం కూలర్లు, AC లు వాడుకుంటున్నారు. కానీ రోజంతా AC లో ఉండి ఏదయినా పని కోసం బయటకు వస్తే వారి శరీరం బయట ఎండను తట్టుకోలేకపోతుంది.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 10:30 PM IST

ఒకప్పుడు ఎండాకాలం(Summer) రాగానే ఆరుబయట మంచాలు వేసుకొని చెట్ల కింద పడుకునేవారు కానీ ఈ రోజుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి తక్కువ, ఇంక బయట పడుకునేవారు లేనే లేరు. ఇప్పుడు ఎండాకాలంలో అందరూ ఇళ్లల్లో ఉండి చల్లదనం కోసం కూలర్లు, AC లు వాడుకుంటున్నారు. కానీ రోజంతా AC లో ఉండి ఏదయినా పని కోసం బయటకు వస్తే వారి శరీరం బయట ఎండను తట్టుకోలేకపోతుంది. కాబట్టి ఇళ్లల్లో ఉండేవారు AC మరీ చల్లగా కాకుండా 26 లో పెట్టుకుంటే కొద్దిగా బయటకు వచ్చినప్పుడు ఎండకు వారి శరీరం తట్టుకుంటుంది.

ఇప్పుడు కొంతమంది చిన్నప్పటి నుండే పిల్లలకు ఎక్కువగా AC అలవాటు చేస్తున్నారు ఇంకా స్కూల్స్ కూడా AC వాటిల్లోనే చదివిస్తున్నారు. కానీ ఇలా చేయడం వలన పిల్లలలో ఏదయినా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారు తట్టుకోలేని స్థితికి వస్తారు. ఇంకా పిల్లలైనా పెద్దలైనా చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అవి మొదటగా శ్వాస కోశ సంబంధ సమస్యలను ఎదుర్కుంటారు. ఇంకా గొంతు పొడిగా ఉండడం, గొంతు సంబంధ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

AC లో ఎక్కువ సమయాన్ని గడపడం వలన తొందరగా అలసట చెందినట్లుగా ఫీల్ అవుతారు. ఇంకా డీహైడ్రాషన్ కు గురయ్యి బయటకు వెళ్ళినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. AC లో ఎక్కువసేపు ఉండడం వలన చర్మం పైన దురద రావడం, చర్మం పొడిబారడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఎండాకాలం లో AC లో ఉండేవారు ఎక్కువ సమయాన్ని AC లో గడపకూడదు. AC లో ఉండాలి అనుకుంటే 26 లో ఉంచుకుంటే మంచిది అంతే కానీ చల్లదనం కోసం మనం 16 లేదా 20 లో పెట్టుకోకూడదు. లేదా రూమ్ అంతా చల్లగా అయ్యేవరకు ఉంచుకొని తర్వాత AC ఆఫ్ చేస్తే మంచిది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలను పైన చెప్పినవి ఎదుర్కోవలసి వస్తుంది.

 

Also Read :  Elbow Black: మోచేతులు నల్లగా అవుతున్నాయా..? ఈ చిట్కాతో తెల్లగా మార్చుకోవచ్చు