Vegetable Soup: ఈ ఆకుకూరల సూప్ తో ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 09:17 PM IST

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువును తగ్గించుకోవడానికి జిమ్ములో ఎక్సర్సైజులు చేయడం వాకింగ్లు చేయడం డైట్ ను ఫాలో అవడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమంది అస్సలు బరువు తగ్గరు. ఏం చేయాలో తెలియక అతిగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా. అయితే ఇలా చేయాల్సిందే. అధిక బరువును ఈ ఆకుకూరల సూప్ తో ఎంతో ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి ఈ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

ఈ సూప్ కి కావలసిన పదార్థాలు.. బ్రొకోలీ, వాటర్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, తులసి ఆకులు, అల్లం, ఉప్పు, మిరియాలు, పాలకూర, మెంతికూర మొదలైనవి. దీనిని తయారు.. ఒక గిన్నెలో నీటిని పోసుకొని తరిగిన ఆకుకూరలని ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన కూరగాయల ఆకు కూరల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్న గిన్నెలు ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి మరుగుతుండగా ఒక గిన్నెలో కొంచెం మొక్కజొన్న పిండి వేసి దాంట్లో పోసి కలిపిన దానిని కూడా ఈ సూప్ లో వేసి బాగా ఉడికించుకోవాలి.

తర్వాత సూప్ చిక్కగా తయారవుతుంది. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి ఇక దింపే ముందు కొత్తిమీర తరుగు వేసి దింపుకోవాలి. అంతే ఎంతో ఈజీగా ఆకుకూరల సూప్ తయారవుతుంది. ఈ ఆకుకూరల సూప్ లో యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ కె, విటమిన్ సి ,పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సూప్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడం వే కాకుండా ఫిట్గా తయారవుతారు. అలాగే అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ సూప్ ని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాగడం వలన అధిక బరువు సమస్య ఈజీగా తగ్గించుకోవచ్చు.