అల్లం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో రకాల వంటల తయారీలో అల్లంని ఉపయోగిస్తూ ఉంటారు. అల్లంని వంటల్లో ఉపయోగించడం వల్ల రుచి పెరగడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజు అల్లం తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే అల్లం మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం వాళ్ళు రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అల్లం ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అల్లంని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కడుపులో గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి దుష్ప్రభావానికి దారితీస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో అల్లాన్ని తీసుకోవడం వలన కడుపు నొప్పికి దారితీస్తుందట. అల్లంని అధికంగా వినియోగించే వారిలో గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని,హృదయ స్పందనలో అసమానకులకు దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే అల్లం ఎక్కువ మోతాదులో తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అల్లం కడుపులో అలజడిని రేపుతుంది.
ఇది తీవ్రమైన అలసటకి బలహీనతకి దారితీస్తుందట. అలాగే గర్భధారణ సమయంలో కూడా అలానే తక్కువగా తీసుకోవాలట. రోజుకి 1500 మిల్లీగ్రాములు మించి అల్లాన్ని తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే అల్లం లో యాంటీ ప్లేట్లెట్ గుణాలు ఉంటాయి ఇది అధిక రక్తస్రావం జరగటానికి కారణం అవుతుంది. కాబట్టి అల్లం ఎంత ఆరోగ్యానికి మంచిది అయినా కానీ మితంగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు.