Health Tips : నిద్రలేమితో అందం తగ్గుతుందా..?

అందంగా లేనా...అస్సలేం బాలేనా....అని సాగే ఓ సినిమా పాట ఉంది తెలుసా..? అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు.

  • Written By:
  • Publish Date - February 12, 2022 / 02:52 PM IST

అందంగా లేనా…అస్సలేం బాలేనా….అని సాగే ఓ సినిమా పాట ఉంది తెలుసా..? అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. నలుగురిలో తామే తళుక్కుమనాలి అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దొరికని క్రీములన్నీ ముఖానికి రాస్తుంటారు. సబ్బులతో రుద్దుతుంటారు. అయితే అందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా….సరిగ్గా నిద్రపోకుంటే అవన్నీ కూడా వ్రుధా అవుతాయంటున్నారు నిపుణులు ఎందుకో తెలుసా…?

అలసిన శరీరానికి నిద్రతోనే కదా కొత్త శక్తి పుంజుకునేంది. ఆ నిద్రతోనే మనస్సు, శరరీం రెండూ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు కంటినిండా నిద్రిస్తేనే అందం కూడా రెట్టింపు అవుతుందన్న విషయం మీకు తెలుసా….మీరు విన్నది నిజమే…నిద్రతోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కండినిండా నిద్రిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం రంగు ఎలాంటిదైనా సరే…అందంగా కనిపించాలంటే…స్కిన్ హెల్తీగా ఉండటం ఎంతో ముక్యం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాల్సిందే. అప్పుడే కదా మీ అందం రెట్టింపు అవుతుంది.

ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. మన లైఫ్ స్టైల్, తీసుకునే ఫుడ్ ఇవ్వన్నీ కూడా నిద్రలేమికి సమస్యకు కారణం అవుతున్నాయి. వీటన్నింటికి తోడు సమయానికి నిద్రపోకుండా ఫోన్లు, ల్యాప్ టాప్ లు టీవీలతో కాలక్షేపం చేయడం వల్ల నిద్రకు దూరం అవుతున్నారు. మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లను రాత్రింబవళ్లు చూడటం వల్ల నిద్రకు దూరం అవుతున్నారు. అందుకే పడుకునే అరగంట ముందు వీటన్నింటిని దూరంగా పెట్టాలి.

సూర్యకాంతి నిద్రకు ఎంతో సహాయపడుతుంది. సూర్యకాంతి వల్ల శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవడంతో అది…నిద్రకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ కొంతసమయం ఎండలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పడుకునే ముందు గది కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఇలా చేస్తే స్వచ్చమైన గాలి లోపలికి వస్తుంది. దీంతో నిద్రబాగా పడుతుంది. నిద్రకు మెలటోనిన్ హార్మోన్ ఎంతో అవసరం. ఈ హార్మోన్ లేట్ గా పడుకుంటే చాలా తక్కువ మొత్తంలో విడుదల అవుతుంది. దాంతోతక్కువగా నిద్రపోతారు. అందుకేప్రతిరోజూ తొందరగా పడుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా రాత్రిపూట లేటుగా ఆహారాన్ని తినొద్దు. దీనివల్ల కడుపులో గ్యాస్, అజీర్ధి వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వీటన్నింటి వల్ల నిద్రకు దూరం కావాల్సి వస్తుంది.

రాత్రిళ్లు ఎంత బాగా నిద్రిపోతే…అంత రెట్టింపు అందం సొంతమవుతుంది. నిద్రవల్ల చర్మం మెరిసిపోతుంది. తాజాగా కనిపిస్తుంది. ఆరోగ్యంగా కూడా బేషుగ్గా ఉంటుంది. కాబట్టి కంటినిండా నిద్రపోండి…అందాన్ని సొంతం చేసుకోండి.