Drinking Water: మంచినీరు రోజుకు ఎన్ని తాగాలో తెలుసా?

ప్రతిరోజు తగినన్ని నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. మీరు ఎంత బాగా తాగితే ఆరోగ్యం అంత బాగా ఉంటుందని, అలాగే అనేక రకాల అనారోగ్య స

  • Written By:
  • Updated On - March 18, 2024 / 07:51 PM IST

ప్రతిరోజు తగినన్ని నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. మీరు ఎంత బాగా తాగితే ఆరోగ్యం అంత బాగా ఉంటుందని, అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతూ ఉంటారు. ప్రతిరోజు మనిషి ఖచ్చితంగా తప్పకుండా రెండు లీటర్ ల నీరు కంటే ఎక్కువ నీదే తాగాలని చెబుతూ ఉంటారు. లేదంటే గ్లాసులతో పోలిస్తే కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కానీ మనం ప్రస్తుతం పనుల్లో పడి కనీసం మీరు తాగడానికి కూడా మనకు సమయం లేకుండా పోయింది.

అలాంటప్పుడు మనం తినే ఆహారం ద్వారా అయినా శరీరానికి కావల్సిన నీరును అందించాలి. రెండు లీటర్ల నీరు కచ్చితంగా తాగాలంటూ దాహం వేయకపోయినా కొందరు తాగుతుంటారు. వారు చేసే పని, ఉండే ప్రదేశం, ఆహారపు అలవాట్లు ఇలా అనేకరకాల అంశాలపై నీరు తాగడమనేది ఆధారపడి ఉంటుంది. వ్యాయామానికి ముందు, వ్యాయామం అయిన తర్వాత లేదంటే బాగా దప్పిక వేసినప్పుడు మాత్రమే నీరు శరీరానికి బాగా ఉపయోగడపతాయి. నీరు ఎంత తీసుకున్నా మంచిదే అన్న భ్రమలో ఎవరూ ఉండొద్దని, ఎక్కువ నీరు తీసుకోవద్దని, అలా తీసుకుంటే ఎన్నో అనర్థాలు కూడా ఉంటాయట.

ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఈ వేసవికాలంలో శరీరానికి తగినన్ని నీరు తీసుకోకపోతే శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టి వేసవిలో శరీరానికి తగినన్ని నీరు తాగాల్సిందే. కాబట్టి ఒక్క వేసవిలో అని మాత్రమే కాకుండా ఇతర కాలాలలో కూడా శరీరానికి సరిపడా నీరు తాగాలి. అలా అని ఎక్కువ నీరు తీసుకున్న కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి.