Site icon HashtagU Telugu

Energy Drinks : ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? నిద్ర సమస్యలు తప్పవు..

Energy Drinks Increases Health Issues

Energy Drinks

Energy Drinks : ఈ రోజుల్లో అందరికీ సంపాదన, పని మీద బిజీ అయి సమయం అనేది చాలా తక్కువ అయిపోతుంది. దీని వలన వారు తినే ఆహారం, ఆరోగ్యం పైన ఎక్కువ ద్రుష్టి పెట్టలేకపోతున్నారు. కాబట్టి తొందరగా ఎనర్జీ వస్తుంది అనే ఉద్దేశ్యంతో ఎనర్జీ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగం చేసేవారు రిఫ్రెష్ గా ఫీల్ అవ్వడానికి ఈ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వలన వెంటనే మనకు ఎనర్జీని ఇచ్చినా దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువే ఉంటాయి.

ఎనర్జీ డ్రింక్స్ రోజూ తాగేవారికి ఎక్కువగా నిద్ర పట్టదు. నిద్రలో మెలుకువ రావడం, ఎంతసేపైనా నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతుంటుంది. అలాగే ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువగా కెఫీన్, చెక్కర, ఎడిటివ్స్ ఉంటాయి. ఇవి తాగడం వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం వంటి సమస్య కూడా రావచ్చు.

ఇప్పటి యువత స్టైల్ కోసం, అప్పటికప్పుడు యాక్టివ్ అవ్వడానికి ఈ ఎనర్జీ డ్రింక్స్ ని ఉపయోగిస్తున్నారు. వీటివల్ల వచ్చే నిద్రలేమి సమస్యలు, గుండె సమస్యలు, షుగర్ సమస్యలు.. మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది. ఎప్పుడో నెలకు ఒకటి రెండు సరదాగా తాగితే పర్లేదు కానీ రెగ్యులర్ గా తాగితే మాత్రం సమస్యలు తప్పవు.

Also Read : Coriander : కొత్తిమీరను ఎక్కువ కాలం నిలువ ఉంచాలంటే ఏం చేయాలి..?