Site icon HashtagU Telugu

Electric Rice Cooker Side Effects: రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Electric Rice Cooker Side Effects

Electric Rice Cooker Side Effects

ఇదివరకు రోజుల్లో అన్నాన్ని ఎంచక్కా మట్టికుండలో కట్టెల పొయ్యి పై వండుకొని తినేవారు. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఆ తర్వాత కరెంటు పోయి లు కూడా రావడంతో కట్టెల పొయ్యి వాడకం విపరీతంగా తగ్గిపోయింది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా గ్యాస్ లేదా కరెంటు పొయ్యిలకే జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇక రైస్ చేసుకోవాలి అంటే ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలామంది పని తగ్గిపోతుంది అని భావించి రైస్ కుక్కర్లో బియ్యం పోసి వాటర్ పోసి స్విచ్ ఆన్ చేసేసి వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం అయిపోగానే ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది.

వైద్యులు ఈ రైస్ కుక్కర్లో చేసిన వంటలు తినడం మంచిది కాదు అని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఉండిన అన్నం ఫుడ్ ఇతర ఆహార పదార్థాలు విషతుల్యంగా మారతాయని చెబుతున్నారు. రైస్ కుక్కర్లను ఎక్కువగా అల్యూమినియంతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పాత్రల్లో ఆహారాన్ని వండటం లేదా నిల్వ చేయడం మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్ లో చేసిన రైస్ తినడం వల్ల ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ వండకూడదు. అల్యూమినియం పాత్రలు తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు వాటిలో ఎక్కువసేపు పుల్లటి, లేదా యాసిడ్ కలిగిన పదార్ధాలను నిల్వ ఉంచకూడదు. రైస్ కుక్కర్ లో చేసిన అన్నం తినడంలో దీర్ఘకాలంలో జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు ఉపయోగించకూడదు. అలాగే నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది.