Eggs: గుడ్లు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?

ప్రతిరోజు గుడ్లు తినడం మంచిదే. తరచూ గుడ్లను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Feb 2024 07 12 Pm 538

Mixcollage 09 Feb 2024 07 12 Pm 538

ప్రతిరోజు గుడ్లు తినడం మంచిదే. తరచూ గుడ్లను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే గుడ్డు తినడం మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. చాలామంది గుడ్డు తినడం మంచిదే అని రోజుకి 5 లేదా 6 అంతకంటే ఎక్కువ గుడ్లను తింటూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మరి ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎగ్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. ఇవి తినడం వల్ల కొన్నిసార్లు అజీర్ణం వాంతులు, వికారం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. చలికాలంలో చాలామంది ఎగ్స్ ఎక్కువగా తింటుంటారు. ఉడకబెట్టిన గుడ్లను కూడా తీసుకుంటారు. అయితే రోజుకు నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినడం శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది గుండె జబ్బులు ప్రేరేపించే ప్రమాదాన్ని పెంచడంతో పాటు శరీరంలో ఇన్సులిన్ రోధకతను కలిగిస్తుంది. ఈ కోడిగుడ్లను అధికంగా తీసుకుంటే మొటిమల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది.

గుడ్డు తిన్న తర్వాత హార్మోన్ లో మార్పు కారణంగా కీళ్ల నొప్పుల సమస్య వస్తుంది. ఎక్స్ లో ప్రొజెక్టర్ అని ఉంటుంది. దీనిలో ఉండే మంచి కొలెస్ట్రాల్ కూడా అధికంగా తింటే బాడ్ కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఇలా మారడం వల్ల గుండె సమస్యలు, లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున మితంగానే తీసుకోవాలి. కాబట్టి గుడ్లు తినాలి అనుకున్న వారు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను తీసుకోవడం మంచిది. అంతకంటే ఎక్కువగా గుడ్లను తీసుకోవాలి అనుకుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

  Last Updated: 09 Feb 2024, 07:12 PM IST