Eggplant: వంకాయను దూరం పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మన వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. అయితే కొందరు వంకాయలు ఇష్టంగా తింటే, మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. వంక

  • Written By:
  • Updated On - March 15, 2024 / 06:44 PM IST

మన వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. అయితే కొందరు వంకాయలు ఇష్టంగా తింటే, మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. వంకాయ తింటే నవ్వలు వస్తాయని , అలాగే పలు రకాల సమస్యలు వస్తాయని చాలామంది వంకాయలు తినడానికి అస్సలు ఇష్టపడరు. వంకాయ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మరి వంకాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వంకాయల్లో విటమిన్ కే, విటమిన్ బి6, పొటాసియం, మాంగనీస్, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి..

గుండె జబ్బులు రావు. వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నిర్మూలిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుzతుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. సులువుగా బరువు తగ్గొచ్చు. కంటి సమస్యలు తగ్గడంతోపాటుd చూపు మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా అవుతాయి ఎముకలు ధృఢంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత బాగా పెరుగుతుంది. జుట్టును, చర్మాన్ని, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వంకాయలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.కానీ నూనెను తక్కువగా ఉపయోగించాలి. ఇది క్యాన్సర్ రాకుండా చూస్తుంది వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగించడంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. శరీరంలోని విషాలను, రసాయనాలను గ్రహించి క్యాన్సర్ ముప్పు రాకుండా తోడ్పడతాయి.