Site icon HashtagU Telugu

Health Tips: పండ్లు, కూరగాయలు శుభ్రం చేయకుండా అలాగే తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Health Tips

Health Tips

ప్రస్తుతం రోజుల్లో అన్నీ కూడా కల్తీ అన్న విషయం తెలిసిందే. అలాగే అన్నీ కూడా మందులతో పండించినవే. అయితే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయట. వీటిని తరచుగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే అన్నం తక్కువగా, పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. కానీ వీటిని కడగకుండా తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి కూరగాయలు, పండ్లు కడగకుండా అలాగే తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కూరగాయలకు, పండ్లకు రకరకాల పురుగు మందులను పిచికారి చేస్తుంటారు. ఈ పురుగు మందులు కూరగాయలు, పండ్లపై అలాగే ఉంటాయి. వీటిని తింటే మన శరీరంపై చెడు ప్రభావం పడుతుందట. పురుగుమందులతో కలుషితమైన పండ్లను, కూరగాయలను తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రభావం ఎన్నో తరతరాలపై పడుతుందట. పండ్లు, కూరగాయలపై ఉండే పురుగు మందులు కంటి, చర్మపు చికాకును కలిగిస్తాయట. వీటిని తింటే మనకు వాంతులు, మూర్ఛ, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయట. కాగా గర్భిణీ స్త్రీలు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన పండ్లను, కూరగాయలను తినడం వల్ల పిండం అభివృద్ధిపై చెడు ప్రభావం పడుతుందట.

అలాగే ప్రసవంలో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. క్రిమి సంహారక మందులు ఉన్న పండ్లను, కూరగాయలను కడగకుండా తింటే పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందట. అలాగే వారు హైపర్యాక్టివిటీ వంటి సమస్యల బారిన పడవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఒక గిన్నెలో పండ్లు, కూరగాయలను వేసి దాంట్లో నీళ్లు పోయాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఉడకబెట్టి తర్వాత పండ్లు, కూరగాయలను కడగాలి. ఫలితంగా పండ్లు, కూరగాయల నుంచి 98 శాతం పురుగుమందులు తొలగిపోతాయట. ఇలా కడిగిన పండ్లు కాయగూరలు తింటే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రావని, వీటిని ఎలాంటి భయం లేకుండా తినవచ్చు అని చెబుతున్నారు.