Site icon HashtagU Telugu

Coconut Oil: కొబ్బరి నూనెలో వీటిని కలిపి రాస్తే చాలు..జుట్టు రాలడం ఆగిపోవడంతోపాటు, చుండ్రు మాయం అవ్వాల్సిందే!

Coconut Oil

Coconut Oil

ఇటీవల కాలంలో జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటిలో చుండ్రు సమస్యతో పాటు జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి. ఇవి రెండు రకాల సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే వీటిని తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో రకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనపడవు. అలాంటప్పుడు ఏం చేయాలో ఏం చేస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెతో పాటు కొన్ని పదార్థాలు కలిపి వాడితే జుట్టుకు పోషణ అంది చాలా రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు అని చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసం కలిసి రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా బలపడతాయట. కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం జుట్టును బలపరుస్తుందట. ఈ రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుందని చెబుతున్నారు..

అలాగే కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుందట. ఇది తేలికపాటి నూనెగా ఉండి జుట్టులో బాగా ఇంకుతుందట. మెంతులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కొబ్బరి నూనెలో మెంతులను కలిపి వేడిచేసి తలకు మసాజ్ చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందట. ఉల్లిపాయ రసం జుట్టు ఊడకుండా అడ్డుకుంటుందట. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసం కలిపి ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుందని చెబుతున్నారు.

జుట్టు సమస్యలకు ఉసిరి కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కాగా ఆమ్లా జుట్టు నల్లగా, దృఢంగా మారడానికి సహాయపడుతుందట. కాగా కొబ్బరి నూనెలో ఆమ్లా పొడి కలిపి వాడితే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయట. నూనెను గోరువె చ్చగా చేసి తలకు మసాజ్ చేయాలని, 30 నుంచి 40 నిమిషాల తర్వాత స్నానం చేయాలని చెబుతున్నారు. అయితే వారానికి 2 లేదా 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చట. ఈ నూనెను వాడటంతో పాటు, తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం కూడా అవసరం. ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.