Dengue: వర్షాకాలంలో డెంగ్యూ ఫీవర్ ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలం మొదలైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పలు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యాయి.

  • Written By:
  • Updated On - July 4, 2022 / 10:26 PM IST

వర్షాకాలం మొదలైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు పలు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో తొలకరి జల్లులు కూడా కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ ఒకవైపు వానలతో సీజనల్ వ్యాధుల వ్యాపించే నుంచి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా డెంగ్యూ మలేరియా వంటి రోగాలు వచ్చే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది వర్షాకాలం నుండి అక్టోబర్ వరకు డెంగ్యూ మలేరియా వ్యాధుల బారిన పడి కొందరు కోరుకుంటున్నాగా మరి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కాగా ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఎం సి డి డెంగ్యూ కేసులపై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేద ప్రకారం చూసుకుంటే జనవరి 1, 2022 నుంచి మే 28 2022 వరకు దాదాపుగా 111డెంగ్యూ కేసులు, 18 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు ఎక్కువగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధుల్లో బారిన పడిన వారు చాలామంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కానీ ఈ రెండు వ్యాధులను ప్రజలు తేలికగా తీసుకోవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగ్యూ అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయానికి వస్తే.. ఆడ ఏడీస్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు చలి జ్వరం, ముక్కు నుంచి లేదా చిగుళ్ళ నుంచి రక్తం రావడం, కొన్ని కొన్ని సార్లు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, రక్తపోటు, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, డెంగ్యూ లక్షణాలు చెప్పుకోవచ్చు. అయితే ఈ డెంగ్యూ మలేరియా వ్యాధిన పడకుండా ఉండాలి అంటే ఇంటి సమీపంలో ఉన్న మీరు నిల్వ ఉన్న ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి.