Site icon HashtagU Telugu

Migraine: మండే ఎండల్లో మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్థాల వాసన చూడాల్సిందే!

Migraine

Migraine

మామూలుగా జ్వరం వచ్చిన తట్టుకోగలం కానీ తలనొప్పి వస్తే మాత్రం తట్టుకోలేవు. తల మొత్తం భారంగా అనిపించి ఏ పని చేయాలని అనిపించదు. ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నిద్రలేకపోవడం, టైమ్‌కి తినకపోవడం, ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం, వర్కౌట్ చేయకపోవడం, ఒత్తిడి, పీరియడ్స్ ఇలా చాలానే కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలో ఎక్కువ సేపు బయట తిరిగినా కూడా మైగ్రేన్ నొప్పి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలు మంచి చిట్కాలుగా పని చేస్తాయట.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ​లావెండర్ ఆయిల్‌ తో ఎన్నో లాభాలు ఉంటాయట. ఈ ఆయిల్ ని వాసన చూడడం వల్ల కూడా మైగ్రేన్ పెయిన్ తగ్గుతుందట. దీనిని డైరెక్ట్‌ గా వాసన చూడవచ్చట. లేదా ఏదైనా క్యారియర్ ఆయిల్‌ లో కలిపి తల వెనుక భాగంలో రాయవచ్చని చెబుతున్నారు. 3 నెలల పాటు లావెండర్ థెరపీని ట్రై చేయడం వల్ల మైగ్రేన్ ఈజీగా తగ్గుతుందట. అలాగే పెప్పర్‌మెంట్ ఆయిల్‌ కూడా ఇందుకు ఎంతో బాగా పనిచేస్తుందట. పెప్పర్‌మెంట్ ఆకుల వాసన చూసినా కూడా తల నొప్పి తగ్గుతుందట. ఈ వాసన చూడడం వల్ల చాలా వరకూ రిలాక్స్‌ గా ఫీల్ అవుతున్నారని దీనికోసం రెగ్యులర్‌ గా పెప్పర్‌మెంట్ వాసన చూడడం మంచిదని చెబుతున్నారు.

తలనొప్పి మైగ్రేన్ వంటి వాటితో పాటు వికారం, వాంతుల వంటి సమస్యల్ని తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుందట. అల్లాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి నోటిలో వేసుకుని రసం పీల్చాలి. లేదంటే టీలా చేసుకుని తాగడం వల్ల సమస్య తగ్గుతుందట. అలాగే మిరియాలు కూడా ఇందుకు ఎంతో బాగా పనిచేస్తాయట. మిరియాలు తలనొప్పిని ఆటోమేటిగ్గా తగ్గిస్తాయట. అయితే దీనికోసం మనం మిరియాలని ఎలా అయినా తీసుకోవచ్చని చెబుతున్నారు. వంటల్లో వాడడం లేదంటే రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడండం వంటివి చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందట. నల్ల మిరియాల్లో ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నేచురల్ పెయిన్ కిల్లర్స్‌ లా పనిచేస్తాయట.