Site icon HashtagU Telugu

Health Tips: పాలలో, ఖర్జూరాలు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Health Tips (2)

Health Tips (2)

ఖర్జూరాలను పాలతో కలిపినప్పుడు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కలుస్తాయి. ఈ రెండింటి కలయిక అప్పటికప్పుడు ఎనర్జీని అందిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు, అలసటగా ఉన్నప్పుడు ఈ రెండింటిని కలిపి తీసుకోవచ్చు. కాగా డేట్స్‌ లో ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ అయిన ఐరన్, పొటాషియం, విటమిన్ బి6‌ లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయట. కాగా గోరు వెచ్చని పాలలో ఖర్జూరాలని కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు దూరమవుతాయనీ చెబుతున్నారు. ఖర్జూరాల్లోని నేచురల్ షుగర్స్, విటమిన్స్ బ్రెయిన్‌ ని ఫ్యూయల్‌‌ లా పనిచేస్తాయట.

వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని,ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. పాలలోని ప్రోటీన్ బ్రెయిన్‌ సెల్స్‌ కి చాలా మంచిదట. ఈ రెండింటిని కలిపి రోజూ తీసుకుంటే మీ బ్రెయిన్ షార్ప్‌గా, ఫోకస్డ్‌ గా పనిచేస్తుందని చెబుతున్నారు. గోరువెచ్చని పాలలో డేట్స్ కలపి రాత్రుళ్లు సమయంలో తీసుకుంటే బాడీ రిలాక్స్ అవుతుందట. దీంతో పాటు ఇందులోని గుణాలు స్లీపింగ్ ఇండ్యూసింగ్ హార్మోన్స్‌ ని రిలీజ్ చేస్తుంది. ఖర్జూరాల్లోని మెగ్నీషియం, మినరల్స్, నరాలని శాంతపరిచి హాయిగా నిద్రపోయేలా చేస్తాయని చెబుతున్నారు. చలికాలంలో చాలా మందికి ఎముకల నొప్పి, కీళ్లు పట్టేయడం జరుగుతుంది. అయితే, పాలలో డేట్స్‌ వేసుకుని తీసుకోవడం వల్ల అందులోని కాల్షియం, మినరల్స్ ఎముకలు, దంతాలని స్ట్రాంగ్‌ గా చేస్తాయి.

వీటిలోని కాల్షియం బోన్ డెన్సిటీని పెంచుతాయి. అలాగే ఖర్జూరాల్లో పొటాషియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ రెగ్యులేట్ అవుతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా కొలెస్ట్రాల్ లెవల్స్ హెల్దీగా మారతాయట. కాగా పాలలోని ఎసెన్షియల్ ఫ్యాట్స్, పోషకాలు, గుండెకి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఖర్జూరం కలిసిన పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి పాలు ఖర్జూరం రెండు కాంబినేషన్ మంచివే కానీ అప్పటికప్పుడు వెంటనే తీసుకోవాలని లేదంటే వాటిని తిన్నా కూడా పెద్దగా ప్రయోజనాలు ఉండవు అని చెబుతున్నారు.