Tomato : టమాటా అధికంగా తింటే కిడ్నీలకు ప్రమాదమా .. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

మన వంటింట్లో దొరికే కూరగాయల్లో టమాటా కూడా ఒకటి. ఈ టమాటాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల కూరల్లో వీటిన

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 04:00 PM IST

మన వంటింట్లో దొరికే కూరగాయల్లో టమాటా కూడా ఒకటి. ఈ టమాటాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల కూరల్లో వీటిని వినియోగిస్తూ ఉంటారు. కొన్ని రకాల కూరలు టమాటా లేకుండా పూర్తి కావు. ఇక బయట రెస్టారెంట్లు, బేకరీల్లో టొమాటో సాస్ తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. కర్రీల్లో గ్రేవీ, టెస్ట్ కోసం టమాటాను కొందరు అధికంగా వినియోగిస్తుంటారు. అయితే కొందరు టమాటాను కూరల్లో మాత్రమే కాకుండా నేరుగా తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి టొమాటో చాలా మంచిది కానీ, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు టమాటా ఎక్కువగా తినకూడదట.

మరి టమాటా ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టమాటాను ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్య లేనివారికి కూడా కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. టమాటాను ఆగ్జాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్స్, కాల్షియంతో పాటు ఆగ్జాలిన్ అనేది మన బాడీలోని యూరిక్ యాసిడ్‌తో కలిసినప్పుడు చెడు జరిగే అవకాశం ఉంది. ఆగ్జాలిన్‌ను యూరిక్ యాసిడ్ శోషించుకోవడం వలన కిడ్నీల్లో చిన్నగా రాళ్లలాగా ఏర్పడుతాయి. క్రమంగా ఇవి పెద్దగా అవ్వడం ద్వారా మూత్రానికి అడ్డుగా ఉంటాయి.

దీంతో మూత్రం పోసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పికలుగుతాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో నీటి స్థాయి పెరిగి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. కొంతకాలానికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టమాటాను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టొమాటను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడానికి లేదా వాటి ఎదుగుదలకు ఆగ్జాలిన్ అనేది చాలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి టమాటాను తక్కువగా తీసుకోవడం మంచిది.