Chocolate: చాక్లెట్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 10:00 PM IST

మామూలుగా చాక్లెట్లను చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాక్లెట్ లను తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు చాక్లెట్లు తినకు పళ్ళు పుచ్చిపోతాయి అని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే చాక్లెట్స్ తినడం మంచిది కానీ మితిమీరి తింటే మాత్రం పెద్దలు చెప్పినట్టుగా సమస్యలు తప్పవు. ఇక మార్కెట్లో మనకి పదుల సంఖ్యలో రకరకాల చాక్లెట్లు లభిస్తున్నాయి. అలా అతిగా తింటే మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలకన్నా పిల్లలు రోజూ చాక్లెట్లు తింటూనే ఉంటారు. మరి చాక్లెట్లను అతిగా తినడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాక్లెట్లు అతిగా తినే వారిలో పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ. అంతేకాదు చాక్లెట్లలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పొట్టనొప్పికి కారణం అవుతాయి. దీనిలోని అధిక చక్కెర కంటెంట్ పేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది. అలాగే చాక్లెట్లలో ఉండే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరిగేలా చేస్తుంది. చాక్లెట్లు అధికంగా తినేవారు తీవ్ర అలసటకు, చికాకుకు లోనవుతారు. అలాగే మానసికంగా కూడా వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. బరువు కూడా త్వరగా పెరుగుతారు. అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాక్లెట్స్ మితంగా తీసుకుంటే శరీరానికి చురుకుదనాన్ని అందిస్తుంది.

అదే అమితంగా తీసుకుంటే అలసటను పెంచుతుంది. మానసిక స్థితిని కూడా మార్చేస్తుంది. కెఫిన్ చాక్లెట్లలో ఉంటుంది. అధికంగా చాక్లెట్లు తింటే అధిక కెఫీన్ శరీరంలో చేరి మానసిక ఆందోళనకు, గుండె దడకు కారణం అవుతుంది. నిద్ర కూడా సరిగా పట్టదు. చాక్లెట్లో ఉండే క్యాలరీలు కూడా ఎక్కువే. కాబట్టి రోజూ చాక్లెట్ తినేవారు త్వరగా బరువు పెరుగుతారు. చాక్లెట్లకు బదులు పండ్లు, కూరగాయలు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఎంత తిన్నా కూడా త్వరగా బరువు పెరగరు. చాక్లెట్లలో నట్స్, పాలు, సోయా వంటివి వాడుతున్నారు. వీటివల్ల కొంతమందికి అలెర్జీ రావచ్చు.ఆ అలెర్జీ ఉన్నవారు తెలియక చాక్లెట్లు తింటే వారి శరీరంపై దద్దుర్లు, దురదలు, శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
రోజుకి చిన్న చాక్లెట్ ముక్క తినడం వల్ల అంతా మంచే జరుగుతుంది. కానీ పూర్తి చాక్లెట్‌ను రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు మీలో జీర్ణ సమస్యలు, మానసిక సమస్యలు వంటివి మొదలవుతాయి. బరువు కూడా త్వరగా పెరిగిపోతారు.