Fruit: బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 11:30 AM IST

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాలు పండ్లు కాయగూరలు తీసుకోవాలి. పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతిరోజు పండ్లను తీసుకోవాల్సిందే. అటువంటి వాటిలో బెర్రీస్ పండు కూడా ఒకటి. వీటినే రాస్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి డార్క్ రెడ్ కలర్ లో ఉండి చూపులను ఆకర్షిస్తూ ఉంటాయి. రాస్ బెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

ఈ టేస్టీ బెర్రీస్ మీ డైట్ లో చేర్చుకుంటే మీ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. రాస్ బెర్రీస్ లో ప్రోటీన్ విటమిన్ సి కె, ఈ, బి మాంగనీస్ ఫైబర్ మెగ్నీషియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. రాస్ బేర్రీస్ మన డైట్ లో చేర్చుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాస్ బెరీస్లో కంటి ఆరోగ్యాన్ని మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి కంటి శుక్లాం, దృష్టి సమస్యలు కంటిలో మచ్చలు లాంటివి నుంచి కాపాడతాయి. బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది. రాస్ బెర్రీ స్లో మెదడు ఆరోగ్యం పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది ఒత్తిడిని ఇంప్లమేషన్ ను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తాయి. అలాగే రాస్ బెర్రీస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి బరువుని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రాస్ బెర్రీస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో కరగని ఫైబర్ మలబద్దకానికి చెక్ పెడుతుంది. రాస్ బెర్రీస్ లోని ఫైబర్ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మీ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రాస్ బేర్రీ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీ డైట్ లో తప్పక చేర్చుకోండి.