Winter Tips: ఈ పండు తింటే చాలు.. శరీరానికి కావలసిన వేడి అందాల్సిందే?

చలికాలం మొదలయ్యింది. చలికాలం రావడంతో పాటు అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 09:55 PM IST

చలికాలం మొదలయ్యింది. చలికాలం రావడంతో పాటు అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే వేడి వేడి పదార్థాలు తినడంతో పాటు కొన్ని రకాల పండ్లను కూడా తింటూ ఉండాలి. అటువంటి వాటిలో అత్తి పండు కూడా ఒకటి. అతి పండ్లు శరీరాన్ని త్వరగా వేడి చేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో అతి పనులు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో వీటిని పెంచడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అంజీర్‌లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, విటమిన్ ఎ, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, రైబోఫ్లావిన్, విటమిన్ బి6, విటమిన్ కె, నియాసిన్, జింక్ వంటి అనేక రకాల ఖనిజాలు ఉంటాయి.

అంతేకాదు ఇది ఫైబర్‌తో కూడిన మంచి డ్రై ఫ్రూట్ అని చెప్పవచ్చు. కాగా ఈ పండ్లు కేవలం శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఎన్నో లాభాలను చేకూరుస్తాయి. అత్తిపండ్లలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ తో సహా అనేక వ్యాధులను కూడా తగ్గించే గుణాలు ఉన్నాయి. అత్తి పండ్లలో ఉండే చాలా మూలకాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి. మెటబాలిజం పెరగడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. అంజీర పండు జలుబు, ఫ్లూ, ఉబ్బసం, దగ్గు, టిబి, జ్వరాన్ని శ్వాసకోశ వ్యాధులు నయం చేస్తాయి. అలాగే ఈ అత్తి పండ్లు గుండెకు మేలు చేస్తాయి. అత్తి పండ్లలో కరిగే ఫైబర్ పెక్టిన్ ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను శరీరం నుండి తొలగిస్తుంది.

పెక్టిన్‌ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం కూడా ఉన్నాయి. అందువల్ల అధిక రక్తపోటును కూడా నయం చేస్తుంది. చర్మ సంరక్షణలో అద్భుతంగా పని చేస్తాయి. ఈ అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. అత్తి పండ్లను ముఖంపై అప్లై చేయడం ద్వారా మొటిమలు మాయమై చర్మం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి సంతానోత్పత్తిని పెంచుతాయి. అత్తి పండ్లను తీసుకోవడం వల్ల స్త్రీ పురుషులిద్దరిలో సంతానోత్పత్తి పెరుగుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. అంజీర పండ్లను పాలలో నానబెట్టి తాగడం వల్ల మేలు జరుగుతుంది.