Site icon HashtagU Telugu

Health : ఈ గింజలు తింటే కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!!

Anatto Seeds

Anatto Seeds

అనట్టో గింజలు..వీటికి గురించి మీకు తెలిసే ఉంటుంది. వీటిని లిపిస్టిక్ తయారీలో వాడుతారు. అయితే ఈ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారం పసుపు కానీ నారింజరంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. రచితోపాటు వాసన కూడా బాగుంటుంది. ఈ గింజల్లో అమైన్లో ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, భాస్వరం విటమిన్ బి, బి3 ఉన్నాయి. అంతేకాదు ఈ గింజల్లో బీటా కెరోటిన్ , విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కణాలు, డీఎన్ఏకు ఫ్రీ రాడికల్ కారణంగా కలిగే నష్టాన్ని నిరోధించడంలో ఈ గింజలు ఎంతో ఉపయోగపడతాయి.

ఈ గింజల్లో మొక్కల్లో కనిపించే సమ్మేళనాలైన ఫైటోకెమికల్స్, సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, ఉన్నాయి. ఇవి మానవ శరీరంలో ఎన్నో రకాల వ్యాధులను నివారించడానికి, చికిత్స చేసేందుకు సహాయపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

పొడిచర్మం, ముడతలు తగ్గించడంతోపాటు వయస్సు మీదపడిన తర్వాత వచ్చే చారాలను కూడా తగ్గిస్తుంది. అందుకే వీటిని కాస్మోటిక్ ప్రొడక్టులలో ఉపయోగిస్తారు. ఈ గింజల్లో కెరోటినాయిడ్స్ ఉండటం వల్ల కంటిచూపు మెరుగుదలకు మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్షాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడంతోపాటు..జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

ఆరోగ్యకరమైన కణజాలల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి. ముఖంపై వచ్చే మచ్చలు, చర్మనష్టాన్ని తగ్గిస్తాయి. కాలిన గాయాలకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా నివారిస్తాయి. ఈ గింజల పొడిని సలాడ్స్ మీద చల్లుకోవచ్చు. కూరల్లో కూడా వేసుకోవచ్చు.