కాలేయం సమస్యల్లో పడిందని తెలిపే ముందు శరీరంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ప్రస్తుతం చిన్న వయస్సులోనే చాలా మంది కాలేయం సమస్యలతో బాధపడుున్నారు. అయితే కాలేయం ఎలా పాడవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. కాలేయ వైఫల్యానికి ప్రధాన కారణం మన జీవనశైలి. తప్పుడు ఆహారపు అలవాట్లు. కొందరు వ్యక్తులు ప్రతిరోజూ ప్యాక్ చేసిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇవి కాలేయానికి చాలా ప్రమాదకరం. ఎలాంటి ఆహార పదార్థాలు ప్రతిరోజూ తినకూడదో తెలుసుకుందాం.
మైదా:
మైదా పిండితో తయారు చేసిన ఆహారాపదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. అవి ప్రాసెస్ట్ చేయబడిన ఆహార పదార్థాలు. ఫైబర్, విటమిన్లు ఇందులో ఉండవు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మైదాతో తయారు చేసే పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి మైదాతో తయారు చేస్తారు. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మంచిది.
ఆల్కాహాల్:
కాలేయ వ్యాధులకు ప్రధాన కారణాలలో ఆల్కహాల్ కూడా ఒకటి. మితిమీరిన ఆల్కాహాల్ తీసుకున్నట్లయితే కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది. కాలేయం ఆల్కాహల్ ను విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక రసాయన ప్రతిచర్య అనేది ఏర్పడుతుంది. ఇది కణాలను దెబ్బతీస్తుంది. దీంతో వాపు, ఫైబ్రోసిస్ కు దారి తీస్తుంది. ఆల్కాహాల్ ఎక్కువగా సేవించడం వల్ల రక్తం వాంతులు, కామెర్లు,శరీరంలో అదనపు ద్రవం చేరడం, కాలేయ క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
చక్కెర:
ఊబకాయంతోపటు చక్కెర శరీరానికి మరింత హానిని కలిగిస్తుంది. మిఠాయిలు, కుకీలు, సోడా అన్నిముడి పదార్థాలు కూడా చెక్కర, అదిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తో తయారు చేస్తారు. ఇవి శరీరంలో కొవ్వును నిల్వ చేస్తాయి. దీంతో కాలేయ వ్యాధికి దారి తీస్తుంది. చక్కరకు బదులుగా బెల్లం తీసుకోవడం మంచిది. అలాగే పండ్ల రసాలు తీసుకునేటప్పుడు చక్కెర ను జోడించకుండా తీసుకోవడం మంచిది.
రెడ్ మీట్ :
ప్రొటీన్లు అధికంగా ఉండే రెడ్ మీట్ జీర్ణం కావడం చాలా కష్టం. కాలేయం ప్రొటీన్ ను విచ్చిన్నం చేయడం సులభమైంది కాదు. అదనపు ప్రొటీన్ ఉత్పత్తి మెదడు, మూత్రపిండాలకు హాని కలిగించే కొవ్వు కాలేయంతో సహా అనేక కాలేయసంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
ఫాస్ట్ ఫుడ్ :
ఫాస్ట్ ఫుడ్ అంత సులభంగా జీర్ణం కాదు. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, వేఫర్లు వంటివి కాలేయానికి మంచివికావు. ఇవి ప్రాసెస్డ్ పద్దతిలో తయారు చేస్తారు. కాలేయంతోపాటు గుండె జబ్బులకు కారణం అవుతుంది.