Raw Onion with Rice : అన్నంతో పాటు పచ్చి ఉల్లిపాయను తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

మామూలుగా చాలామందికి భోజనం చేసేటప్పుడు ఆహారంలోకి నంజుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. కొందరు మిక్చర్ , పొటాటో చిప్స్, వడియాలు ఇలా ఏదో ఒకటి నంజుకు

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 04:00 PM IST

మామూలుగా చాలామందికి భోజనం చేసేటప్పుడు ఆహారంలోకి నంజుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. కొందరు మిక్చర్ , పొటాటో చిప్స్, వడియాలు ఇలా ఏదో ఒకటి నంజుకుని తింటూ ఉంటారు. ఇంకొంతమందికి భోజనం చేసేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు తినడం బాగా అలవాటు. అన్ని కూరల్లోకి కూడా వచ్చి ఉల్లిపాయలను తెగ తినేస్తూ ఉంటారు. మరి పచ్చి ఉల్లిపాయలు అన్నంలోకి తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఉల్లి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఉల్లిగడ్డ తగ్గిస్తుంది. అందుకే ప్రతి కూరలో ఉల్లిగడ్డను వేసి వంటలు చేస్తూ ఉంటారు.

నిజానికి ఉల్లిగడ్డలో క్వెర్సెటిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మంటను తగ్గిస్తుంది. అలెర్జీని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అదే పచ్చి ఉల్లిగడ్డను అలాగే భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పచ్చి ఉల్లిగడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచే కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిగడ్డలో విటమిన్స్ కూడా ఉంటాయి. మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చాలా సమస్యలను దూరం చేస్తాయి. ఉల్లిగడ్డ యాంటీ బ్యాక్టీరియల్ గా , యాంటీ ఆక్సిడెంట్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది.

అందుకే షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేయాలన్నా ఉల్లిగడ్డ సూపర్ గా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిగడ్డ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. క్యాన్సర్ కారకాలను నాశనం చేయడం, మెటిమలు, చర్మ సంబంధ వ్యాధులను తగ్గించడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ ను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం.. ఇలా చాలా రకాల జబ్బులకు ఒకే ఒక మందు ఉల్లిగడ్డ. ఉల్లిపాయ ముక్కలను కూరలో వేసి వండేటప్పుడు కొన్ని విటమిన్లు ఉండవు. కాబట్టి భోజనం లోకి ఇతర ఆహార పదార్థాలలోకి ఉల్లిగడ్డ తినేవారు ఎటువంటి భయం లేకుండా తినవచ్చు.