Site icon HashtagU Telugu

Radish: వామ్మో.. రాత్రి సమయంలో ముల్లంగి తింటే అంత డేంజరా?

Radish

Radish

మన వంటింట్లో దొరికితే కూరగాయలలో ముల్లంగి కూడా ఒకటి. ఈ ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ముల్లంగి తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పిగా లాంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగి తింటే ఎంతో మంచిది. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి. ముల్లంగి తినడం మంచిదే కానీ రాత్రి సమయంలో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముల్లంగిని రాత్రిపూట తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలీక సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. రాత్రిపూట ముల్లంగిని తినడం వల్ల శరీరంలో నొప్పులు పెరుగుతాయి. అయితే ఇప్పటికే శరీరంలో నొప్పులు కలిగి ఉన్నవారు ముల్లంగిని తినకపోవడం మంచిది. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల బీపీ సమస్యలు కూడా వస్తాయి. ముల్లంగిలో శరీరానికి హాని కలిగించే హైపోగ్లైసీమిక్ పరిమాణాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుత రోజులో చాలా మంది పొత్తి కడుపు సమస్యతో బాధపడుతున్నారు.

అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే. అలాగే ముల్లంగిని అతిగా తీసుకోడం వల్ల కూడా పొత్తి కడుపు సమస్య వస్తుంది. ఈ నొప్పులతో పాటు మోకాలి, నడుము, భుజం కాలు నొప్పులు, భుజం నొప్పులు కూడా వస్తాయి. ముల్లంగిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్లు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో విటమిన్ ఎ, సి, ఈ, బి6, పొటాషియం వంటి అనేక పోషకాలున్నాయి. ముల్లంగిలో భాస్వరం, జింక్ చలికాలంలో పొడి చర్మానికి పోషణనిస్తుంది.