శీతాకాలం మొదలైంది. రోజు రోజుకి చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి సమయంలో చాలామంది కొన్ని రకాల ఆహార పదార్థాలలో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో చికెన్ కూడా ఒకటి.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం చలికాలంలో ఎక్కువగా చికెన్ తింటుంటారు. కానీ చలికాలంలో చికెన్ తినడం మంచిది కాదని చెబుతున్నారు. ఎందకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్రాయిలర్ చికెన్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందట. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు.
కాగా ఈ బ్రాయిలర్ చికెన్ అనేది ఒక రకమైన దేశీయ చికెన్, ఇది ప్రధానంగా మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. ఇది వేగంగా పెరగడానికి, తక్కువ సమయంలో ఎక్కువ మాంసాన్ని అందించే విధంగా ప్రత్యేకంగా పెంచుతారు. బ్రాయిలర్ కోళ్లు సాధారణంగా 35-45 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి. కాగా ఇవి వేగంగా పెరగడం కోసం కొన్ని రకాల ఇంజక్షన్స్ కూడా వేస్తూ ఉంటారు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ కోళ్లను తినడం విరేచనాలకు దారితీస్తుందట. అంతేకాకుండా చర్మ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పోరాడటంలో మందులు కూడా విఫలం అవుతున్నాయంట.
బాగా వండిన చికెన్ తినడం ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించవచ్చు అని మీరు అనుకుంటే అది సాధ్యం కాదట. ఈ నమూనాలలో కనిపించే చాలా బ్యాక్టీరియా చాలా బలంగా ఉంటుంది, అధిక మంటపై ఉడికించినప్పటికీ, బ్యాక్టీరియా నాశనం కాదట. ఇలాంటి చికెన్ తినడం వల్ల ఒక వ్యక్తికి హానికరమైన బ్యాక్టీరియా సోకితే, వ్యాధులను నయం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా యాంటీ మైక్రోబయల్ నిరోధకతను కలిగి ఉంటాయట. ఒకవేళ మీరు చికెన్ తీసుకోవాలి అనుకుంటే నిల్వ ఉంచిన చికెన్ కొనడం మానేయాలి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉన్న చికెన్ మాత్రమే తినాలి. చికెన్ కొనేటప్పుడు బోన్ లెస్, స్కిన్ లెస్ చికెన్ తినడం ఆరోగ్యకరం.