Site icon HashtagU Telugu

Milk- Banana: పాలు, అరటిపండు కలిపి తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Milk Banana

Milk Banana

ప్రస్తుత రోజుల్లో మనకు బయట దొరికే ఫుడ్ చాలా వరకు కలుషితమైనది. అటువంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. అయితే చాలామంది ఆహారం విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చికెన్ మటన్ చేపలు లాంటి మసాలా ఫుడ్ ఐటమ్ తిన్నప్పుడు పెరుగు తినకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ చాలామందికి మసాలా కర్రీ తిన్న తర్వాత పెరుగు లేనిదే ముద్ద కూడా దిగదు..

అలాగే ఎప్పుడూ కూడా పాలు అరటిపండు రెండు కలిపి తీసుకోకూడదు. ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..అరటిపండులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. అలాగే పాలలో క్యాల్షియం, విటమిన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి మరిన్ని రోగాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఉబ్బసం ఉన్న వారు ఈ రెండు తింటే శ్వాసకోశ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే పాలు, అరటిపండ్లను కలిపి తీసుకుంటే శరీరం మీద దద్దుర్లు, జలుబు, దగ్గు, సైనస్ సమస్య, గ్యాస్టిక్ సమస్య, వాంతులు, విరేచనాలు అవుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు ఆహారాలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. ఇవి మెదడు పనితీరుకు కూడా ఆటంకం కలిగిస్తాయట.. అందుకే పాలు, అరటిపండు తినేప్పుడు మధ్యలో 20 నిముషాలు అయిన గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.