Site icon HashtagU Telugu

Musk Melon: వేసవికాలంలో దొరికే ఈ పండు గింజలు తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Musk Melon

Musk Melon

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ మండే ఎండల్లో ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇకపోతే మామూలుగా వేసవికాలంలో చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో ఖర్బుజా పండు కూడా ఒకటి. ఈ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఈ కర్బూజా పండులో 95 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయతో పోల్చుకుంటే కర్బూజా పండు మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

కర్బూజా వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. తిని దాని విత్తనాలు బయటకు పారేస్తూ ఉంటాం. ఈ విత్తనాల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ఖర్బుజా విత్తనాలు డయాబెటిక్ వ్యాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయట. ఎందుకంటే ఈ ఖర్బుజాలో శక్తివంతమైన యాంటీ బయాటిక్స్,యాంటీ హైపర్లిపిడెమిక్ ఏజెంట్లు ఉంటాయట. ఇది ఆక్సీకరణ ఒత్తిడిలో ముఖ్యమైన పాత్ర పోషించే పాలీఫెనాల్స్ సమ్మేళనాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఖర్బుజా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

కాబట్టి ఇది నెమ్మదిగా శోషించబడుతుందట. రక్తంలో చక్కెరలో ఎక్కువ పెరగదట. కాబట్టి ఎలాంటి భయం లేకుండా కర్బూజా విత్తనాలు తినవచ్చు అని చెబుతున్నారు. ఖర్బుజా గింజలు మంచి మొత్తంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. ఇవి మధుమేహ రోగులకు శక్తిని అందిస్తాయని చెబుతున్నారు. అలాగే ఈ ఖర్బుజా గింజల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తాయట. విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం పొటాషియం తీసుకోవడం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుందట. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని, వారి దినచర్య సమతుల్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.