Site icon HashtagU Telugu

Side Effects of Kiwi: పొరపాటున కూడా వీరు కివిని అస్సలు తినకూడదు.. తిన్నారో ఇక అంతే సంగతులు!

Side Effects Of Kiwi

Side Effects Of Kiwi

కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కివిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, భాస్వరం, మెగ్నీషియం, రాగి, జింక్, నియాసిన్, రిబోఫ్లేవిన్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగించడంతో పాటు అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే కివి పండ్లు మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ కివి పండ్లకు దూరంగా ఉంటేనే మంచిదట.

మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కివి పండు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివి పండ్లకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. కివిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్ర పిండాల వ్యాధులతో బాధపడే వారిపై మరింత ఎఫెక్ట్ చూపుతుందట. అందుకే కిడ్నీ రోగులు ఆహారంలో పొటాషియం తక్కువ మొత్తంలో తీసుకోవాలని చెబుతున్నారు. కివి పండ్లను అతిగా తినటం వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయట. అలాగే చర్మం పై దద్దుర్లు, వాపు, దురద, ఉబ్బసం వంటి అనేక రకాల అలెర్జీ సమస్యలు కూడా వస్తాయట. కొందరిలో నోటి అలెర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవారు కివికి దూరంగా ఉండటం మంచిదట.

కిడ్నీ రోగులు తమ ఆహారంలో తక్కువ మొత్తంలో పొటాషియం తీసుకోవాలని చెబుతున్నారు. కివి ఎక్కువగా తినడం వల్ల కూడా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వస్తుందట. ఈ సమస్యలో క్లోమం వాపు రావచ్చని చెబుతున్నారు. అలాంటి వారు తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కివిలో ఉండే అధిక ఫైబర్ విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుందట. గర్భిణీ స్త్రీలు ఒక రోజులో రెండు లేదా మూడు కివిలకు మించి తినకూడదట. కివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్యాస్ట్రిటిస్, జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కివి తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. కివిలో ఉండే యాసిడ్ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందట.