ప్రస్తుత రోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ రక్తహీనత సమస్య కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయం తెలిసిందే. రక్తహీనత సమస్య అన్నది చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. రక్తహీనత సమస్య నుంచి బయటపడటం కోసం దానిమ్మ,బీట్రూట్,ఆకుపచ్చని కూరగాయలు,పండ్లు వంటివి తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. వీటితోపాటుగా బెల్లం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.
బెల్లం రక్తహీనత సమస్యతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచడంలో బెల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బెల్లం తినడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. బెల్లంలో విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం , ఫాస్పరస్, పొటాషియం, జింక్, సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో రక్తాన్ని పెంచడానికి మాత్రమే కాకుండా జీర్ణశక్తిని బలోపేతం చేయడంలో కూడా బెల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలను బెల్లం నయం చేస్తుంది.
అంతేకాకుండా బరువు గాలి అనుకున్న వారు టీలో షుగర్ కు బదులుగా బెల్లాన్ని వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పిగా ఉంటే అటువంటప్పుడు బెల్లం తినడం వల్ల ఆ కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే కీళ్ల నొప్పులు కీళ్ల వాపుల సమస్యతో బాధపడేవారు బెల్లం తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అదేవిధంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడే బెల్లం తినడం ద్వారా అది వారికి ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. తరచుగా గా బెల్లం తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.